BigTV English

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్

Supreme Court:  తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో సమర్థించింది.  వరుసగా నాలుగేళ్లు చదివితేనే లోకల్ అవుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. లోకల్ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.


తెలంగాణలో వరుసగా 9 తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే నాలుగు తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. లోకల్ రిజర్వేషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది సుప్రీంకోర్టు.

ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన జీవో నెంబర్ 33ని సమర్ధించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రం తమకు అనుగుణంగా నిబంధనలను తయారు చేసుకున్నాయని, ఆ అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని కోర్టులో వాదించింది.


దీనిపై సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. గతేడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది సుప్రీంకోర్టు. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ యూజీ కోర్సులకు లోకల్ రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది.

ALSO READ: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత.. కేటీఆర్ ఫైర్, హరీష్‌రావు పిటిషన్

వైద్య విద్యార్థుల స్థానికత ఇష్యూపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఎంఎస్, ఎంబీబీఎస్, పీజీ కోర్సుల అడ్మిషన్ల విషయంలో స్థానిక విద్యార్థులకు ప్రయార్టీ ఇవ్వాలా? అందరికీ సమాన అవకాశాలు కల్పించాలా? అనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేసింది న్యాయస్థానం.

తాజా తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో అయితే వైద్య విద్యలో రిజర్వేషన్ పొందాలంటున్నారో, కనీసం నాలుగేళ్లు ఆ విద్యార్థులు అక్కడ చదివాలి. అప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన స్థానిక కోటాలో మెడికల్ సీట్లు పొందుతారు. ఇతర రాష్ట్రాలవారు ఆ కోటాకు అర్హులు కారని తేల్చింది.

వైద్య విద్య అనేది స్థానిక ప్రజల అవసరాలకు ముడిపడి ఉందని పేర్కొంది న్యాయస్థానం. రాష్ట్రంలో వైద్య సీట్లు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు లాభం పొందాలని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకుని స్థానికత తప్పనిసరి చేయడం మంచిదేనని అభిప్రాయపడింది.

న్యాయస్థానం ఆదేశాలతో స్థానిక విద్యార్థులకు బిగ్ రిలీఫ్. దేశంలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల కోటాలో సీట్లు పొందేవారు. నీట్ ద్వారా జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్ జరుగుతుంది. స్టేట్ కోటా సీట్ల విషయంలో స్థానికత నిబంధన ఇకపై తప్పనిసరి. 15 శాతం ఆల్ ఇండియా కోటా యథాతథం కాగా, మిగతా 85 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకే కేటాయించనున్నారు.

 

Related News

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Telangana RTC: ప్రమాదాల వేళ కొత్త నిర్ణయం..డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్

Big Stories

×