E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పోలీస్ స్టేషన్ టు బిగ్‌బాస్ హౌస్? సీజన్ 10 మేకర్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఎస్‌ఐ..

పోలీస్ స్టేషన్ టు బిగ్‌బాస్ హౌస్? సీజన్ 10 మేకర్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఎస్‌ఐ..
Advertisement

Nandyal SI Seeks Bigg Boss: బిగ్ బాస్ ..మొదట్లో సినిమా సెలెబ్రెటీలకే ఎంట్రీ అనుకున్న ఈ రియాలిటీ షో మెల్లిగా కామన్ మ్యాన్ లకి గేట్లు తెరవడంతో చాలా మంది వెళ్లి తమ అదృష్టాన్ని పరిక్షించుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక పోలీస్ ఎస్సై బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు క్యూరిసిటీ చూపించడం విశేషం.అవును.. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున రెడ్డి నాకు ఒక అవకాశం ఇప్పించండి అంటూ వదిలిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సెల్ఫీ వీడియోను చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎస్సై 

Advertisement

సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకుని సీరియస్ గా కనిపించే పోలీసులు ఇలా రియాలిటీ షో లవైపు ఆసక్తి చూపడం చాలా రేర్. కానీ నాగార్జున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాల్సిందే అంటూ తనలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు.దీంట్లో భాగంగా తనే స్వంతంగా ఒక ఒక సెల్ఫీ వీడియోను చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.రాబోయే బిగ్‌బాస్ సీజన్ 10లో తనకు కచ్చితంగా ఒక అవకాశం కల్పించాలని ఆయన షో నిర్వాహకులను కోరారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న తన కోరిక ని
ఈ వీడియో వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా ఆయన ఇందులో చెప్పడం కనిపిస్తుంది.

తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే

తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని,వారి చిరునవ్వుల కోసం ఒక తండ్రిగా తాను ఈ అడుగు ముందుకు వేశానని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. బాధ్యతాయుతమైన పోలీస్ ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఇష్టానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

Advertisement

also read:వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం.. టీజర్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారంటీ!

అయితే బిగ్ బాస్ లోకి వస్తానని కోరడంతోనే సరిపెట్టకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే తాను ఎలాంటి ప్రదర్శన ఇస్తానో కూడా ఆయన ముందే క్లారిటీగా చెప్పడం విశేషం.ఒక పోలీస్ అధికారిగా కఠినమైన శిక్షణ, మానసిక దృఢత్వం తన సొంతమని, హౌస్‌లో ఎలాంటి క్లిష్టమైన టాస్క్‌లు ఇచ్చినా తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.

పిలుపు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే

బిగ్‌బాస్ ఇంట్లో ఉండే మానసిక ఒత్తిడిని, భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో ఒక పోలీస్‌గా తనకు బాగా తెలుసని ఆయన మాటల్లో అర్థమవుతోంది. సాధారణంగా బిగ్‌బాస్ షోలో గ్లామర్ ప్రపంచానికి చెందిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ గత కొన్ని సీజన్లుగా కామన్ మ్యాన్ కేటగిరీతో పాటు భిన్నమైన రంగాల నుంచి వచ్చేవారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ హౌస్‌లోకి వస్తే షో రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగార్జున రెడ్డి షేర్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. పోలీస్ శాఖలో కూడా ఈ వీడియోపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి క్రేజీ రియాలిటీ షో ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వాలని అనుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

also read:పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

ఇక ఈ వీడియో ఖచ్చితంగా బిగ్‌బాస్ నిర్వాహకుల దృష్టికి వెళ్తుందని, ఒకవేళ ఆయనకు సీజన్ 10లో అవకాశం వస్తే హౌస్‌లో సరికొత్త వైబ్స్ రావడం ఖాయమని భావిస్తున్నారు విశ్లేషకులు.చూడాలి మరి కన్న కూతుళ్ళ కోరికని తీర్చాలని ఆరాట పడుతున్న ఈ ఎస్సై గారికి బిగ్ బాస్ నుండి పిలుపు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related News

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం.. టీజర్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారంటీ!

‘మా ఇంటి బంగారం’ సినిమాకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్ జోన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘స్పిరిట్’ టైటిల్ వివాదంపై కన్నీరు పెట్టుకున్న నిర్మాత!.. అసలు ఏంజరిగిందంటే?

‘OG యూనివర్స్’ నుంచి బిగ్ అప్డేట్.. గంభీర ‘అన్‌టోల్డ్ స్టోరీ’తో ఊచకోతకు రెడీ!

Big Stories

×