Virat Kohli One8 Shoes: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో వేలాది పరుగులు చేసి టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించాడు. టీమిండియా కెప్టెన్ గా కూడా ఎన్నో టైటిల్స్ తీసుకువచ్చాడు. క్రికెట్ తో పాటు వ్యాపారాల్లో కూడా విరాట్ కోహ్లీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్లు, ఇతర బ్రాండ్లతో పలు కంపెనీలు విరాట్ కోహ్లీ పేరుపైన ఉన్నాయి. లేటెస్ట్ గా వన్ 8 షూ (Virat Kohli One8 Shoes) బ్రాండ్ కూడా లాంచ్ చేశాడు విరాట్ కోహ్లీ. గత వారం లాంచ్ అయిన ఈ షూ బ్రాండ్, సేల్స్ లో దూసుకు వెళ్తోంది. 24 గంటల్లోనే 1.5 లక్షలకు పైగా జతలు అమ్ముడు అయ్యాయి. దీంతో విరాట్ కోహ్లీ కంపెనీకి కోట్లలో కలెక్షన్స్ వచ్చాయి.
విరాట్ కోహ్లీకి (Virat Kohli) సంబంధించిన వన్ 8 షూ కంపెనీ రికార్డ్ స్థాయిలో సేల్స్ అందుకుంటున్న నేపథ్యంలో ఫేక్ షూలు కలకలం రేపాయి. కొంత మంది one 8 (One8 Shoes) బూట్లు కొనలేక… ఆ కంపెనీ తరహాలోనే సింబల్స్ ప్లేన్ షూలపై క్రియేట్ చేశారు. వన్ 8 తరహాలోనే ఈ బూట్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో విరాట్ కోహ్లీకి సంబంధించిన one 8 బ్రాండ్ షూలు ఫేక్ వి ( Fake One8 Shoes) కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ షూలు క్రియేట్ చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొంతమంది విరాట్ కోహ్లీ One 8 బ్రాండ్ కొన్ని స్తోమత లేక… ఫేక్ బూట్లు తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నట్లు మరి కొంత మంది చెబుతున్నారు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సొంత బ్రాండ్ వన్ 8 షూ కంపెనీని తాజాగా లాంచ్ చేయగా… ఈ బూట్లు రికార్డు సేల్స్ సాధిస్తున్నాయి. మొదటి 24 గంటల్లోనే 1.5 లక్షలకు పైగా జతలు అమ్ముడై సంచలనానికి తెరలేపింది. అంటే ఇష్యూ కంపెనీ లాంచ్ అయిన రోజున 140 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రాబడి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా ఈ బూట్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతూనే ఉన్నారు. మొదట్లో వన్ 8 పూమా భాగస్వామ్యంతో వచ్చేవి. రూ.300 ఆఫర్ ఇచ్చినా కూడా కోహ్లీ, తన బ్రాండ్ ను సొంతంగానే రిలీజ్ చేసుకున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==