Nayanthara Maldives vacation: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. అదే క్రేజ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ, హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. పెళ్లయ్యి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా.. అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదనే చెప్పాలి. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది నయనతార.
ఇదిలా ఉండగా ఇటీవల ఈమె నటించిన టాక్సిక్,హాయ్ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.పైగా బాక్సాఫీస్ వద్ద చాట లేకపోయాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా తలమునకలయిన నయనతార కాస్త చిల్ కోసం మాల్దీవులకు వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ సముద్ర తీరాన సందడి చేస్తూ.. గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎల్లో కలర్ మినీ గౌన్ ధరించి.. కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. తలకు హ్యాట్ పెట్టుకొని సముద్ర తీరంలో వాకింగ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు.. మినీ ఫ్రాక్ లో గ్లామర్ వలకబోస్తూ నయనతార పంచుకున్న ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు అందరి కళ్ళు నయనతార బస చేసిన రిసార్ట్ పైనే అనే చెప్పాలి. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ అల్ట్రా లగ్జరీ రిసార్ట్ ను ఎంచుకుంది. ముఖ్యంగా దాని ఖర్చు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా తాను చేసిన పోస్టులో ఆ రిసార్ట్ లొకేషన్ కూడా ట్యాగ్ చేయడంతో ఈ వివరాలు వైరల్ గా మారాయి. నయనతార మాల్దీవుల్లోని ‘నార్త్ మేల్ అటోల్’ లో ఉన్న ఫారీ ఐలాండ్ కు వెళ్లారు. అక్కడ ఉన్న ‘పటీనా మాల్దీవ్స్’ అనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్లో ఈమె బస చేశారు.
అయితే నయనతార ఉంటున్న ఈ హై – ఫై రిసార్ట్ ధర వింటే మాత్రం ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఇద్దరు వ్యక్తులు ఒక రాత్రి ఇక్కడ బస చేయాలి అంటే అక్షరాల రూ. 3,92,376 ఖర్చు చేయాల్సిందే. ఇక ఈ లెక్కన చూసుకుంటే నయనతార వీకెండ్ లో కేవలం రెండు రోజులు, రెండు రాత్రులు ఈ రిసార్ట్ లో గడపాలంటే అక్షరాలా 8 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నయనతార వీకెండ్ వెకేషన్ ఖర్చు అన్ని లక్షల అంటూ నివ్వెర పోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతారకు ఈ ఖర్చు పెద్దదేమి కాదు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ: బిగ్ బాస్ హౌస్ లోకి అపూర్వ.. మరో కొత్త లవ్ ట్రాక్ షురూ!
ప్రస్తుతం మూకుత్తి అమ్మన్ 2 చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రాన్ని తెలుగులో మహాశక్తి పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రక్కాయి అనే తమిళ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. మలయాళ , తమిళ్ ద్విభాష చిత్రమైన డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో కూడా నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.