E-Paper
Advertisement

పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!
Advertisement

Pen Drive Holes: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పెన్ డ్రైవ్ కు ఉన్న ప్రాముఖ్యం అంత ఇంత కాదు. ఆఫీస్ డాక్యుమెంట్లు, డిజిటల్ ఫోటోలు, వీడియోలు అన్నీ ఈ చిన్న పెన్ డ్రైవ్‌లో ప్రతీ ఒక్కరు దాచుకుంటూ ఉంటారు. అటువంటి పెన్ డ్రైవ్ ను ఎప్పుడైనా నిశితంగా గమనించారా? డ్రైవ్‌ చివరన పైభాగంలో రెండు చిన్న రంధ్రాలను గుర్తించారా? చాలామంది వీటిని కేవలం ఒక డిజైన్ అనుకొని వదిలేస్తుంటారు. కానీ ఆ చిన్న రంధ్రాల వెనుక ఉన్న అసలు ఉపయోగం ఏంటో తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు.

ఆ రంధ్రాలు ఎందుకంటే?

పెన్ డ్రైవ్‌కు ఉండే ఈ రంధ్రాలు.. మంచి ‘గ్రిప్’ను అందిస్తాయి. పెన్ డ్రైవ్‌ను కంప్యూటర్, ల్యాప్‌టాప్, USB పోర్ట్‌లో పెట్టేటప్పుడు, బయటకు తీసేటప్పుడు వేళ్లు జారిపోకుండా ఉండటానికి ఈ డిజైన్ సహాయపడుతుంది. దీనివల్ల పెన్ డ్రైవ్ పట్టు తప్పి కింద పడకుండా జాగ్రత్తపడవచ్చు.

కీచైన్‌లు తగిలించుకోవడానికి..

Advertisement

ఈ రంధ్రాల వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. కీచైన్ లేదా స్ట్రాప్‌లను పెన్ డ్రైవ్ లకు తగిలించవచ్చు. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే పెన్ డ్రైవ్‌లు ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. కాబట్టి ఈ రంధ్రాల ద్వారా కీచైన్‌కి లేదా బ్యాగ్ జిప్‌కి తగిలించుకోవడం వల్ల పెన్ డ్రైవ్ పోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

కింద పడి పాడవకుండా..

పెన్ డ్రైవ్ చిన్నగా ఉండటం వల్ల చేతిలోంచి జారి పడటం, సందుల్లో ఇరుక్కుపోవడం సహజం. కాబట్టి ఈ రంధ్రాల సహాయంతో పెన్ డ్రైవ్‌ను చిన్న తాడు (స్ట్రాప్) ద్వారా బ్యాగ్‌కు లేదా బెల్ట్‌కు కట్టుకోవచ్చు. దీనివల్ల ప్రమాదవశాత్తు చేయి జారినా అది నేరుగా కింద పడకుండా వేలాడుతుంది. ఫలితంగా లోపలి సర్క్యూట్ పాడవకుండా సురక్షితంగా ఉంటుంది.

వేడిని తగ్గించేందుకు తోడ్పాటు

Advertisement

కొన్ని రకాల పెన్ డ్రైవ్‌లలో ఈ రంధ్రాలు లోపలి వేడి బయటకు వెళ్లడానికి కూడా తోడ్పడతాయి. పెద్ద మొత్తంలో డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు, ఎక్కువ సేపు వాడినప్పుడు పెన్ డ్రైవ్‌లు వేడెక్కడం సర్వసాధారణం. అటువంటప్పుడు ఈ చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరణ జరిగి పరికరం అతిగా వేడెక్కకుండా చూస్తుంది. ఇది పెన్ డ్రైవ్ జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

Also Read: శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

యూజర్ల సౌకర్యమే ముఖ్యం

టెక్ కంపెనీలు పెన్ డ్రైవ్‌లను కేవలం అందంగా కనిపించడం కోసమే కాకుండా వినియోగదారుల సౌకర్యాన్ని మనస్సులో ఉంచుకుని డిజైన్ చేస్తాయి. ఈ క్రమంలో ఈ చిన్న రంధ్రాలు పెన్ డ్రైవ్‌ను వాడటం మరింత సులభంగా, సురక్షితంగా మారుస్తాయి. అందుకే దాదాపు ప్రతి కంపెనీ తమ పెన్ డ్రైవ్ డిజైన్‌లో వీటిని తప్పనిసరిగా చేరుస్తుంది.కాబట్టి ఇకపై పెన్ డ్రైవ్‌లోని ఈ రంధ్రాలను సరిగ్గా ఉపయోగించి దానికి ఒక చిన్న కీచైన్ లేదా స్ట్రాప్ తగిలించండి. తద్వారా డేటాను, పెన్ డ్రైవ్‌ను పోగొట్టుకోకుండా పదిలంగా ఉంచుకోండి.

Also Read: ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

Tags

Related News

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

అల్టిమేట్ ఫీచర్లతో..టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్, మీరూ ఓ లుక్కేయండి

కొత్త వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్..ఇంత వరకూ లేని ఫీచర్లతో హల్ చల్!

లుక్స్,బ్యాటరీ చూసి ఇయర్‌బడ్స్ కొంటే మోసపోతారు!ఈ ఒక్కటి చెక్ చేస్తే చాలు

కొత్తవి కొనకండి! పాడైపోయిన బల్బులను ఇలా క్షణాల్లోనే రిపేర్ చేయండి!

నవంబర్‌లో కొత్త ఫోన్ల జాతర.. వివో, షావోమీ, వన్‌ప్లస్ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే మోడల్స్ ఇవే!

రూ.15 వేలకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. అమెజాన్‌లో 4 రియల్‌మీ ఫోన్లపై మతిపోయే ఆఫర్లు!

ఒక్కొక్కరికి 50 వేల డాలర్లు.. యూట్యూబర్లకు ఇన్‌స్టా బంపరాఫర్!

Big Stories

Advertisement
×