E-Paper
Advertisement

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?
Advertisement

Hospital Maintenance: స్వేచ్ఛ బ్యూరో: పేదలను కాపాడాల్సిన ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోన్నది. సర్కారీ దవాఖాన్ల మెయింటనెన్స్ లో అధికారుల వైఫల్యం నెలకొన్నది. సివిల్ పనుల నుంచి శానిటేషన్ వరకు,మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అత్యవసర యంత్రాల నిర్వహణ వరకు ప్రతీది అట్టర్ ప్లాప్ కావడంతో సర్కారీ హాస్పిటళ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఏదో ఒక ఆసుపత్రిలో ప్రమాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న వరంగల్ ఎంజీఎంలో ఓ వార్డులో పెచ్చులూడి కింద పడటం మరువకముందే, మంగళవారం ఆదిలాబాద్ రిమ్స్‌ హాస్పిటల్ లో చిన్నారుల వార్డులో మరో ప్రమాదం జరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ సంఘటన జరిగిన తర్వాతే అధికారులు హాడావిడి చేసి, ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పేదలకు కార్పొరేట్ స్​థాయిలో వైద్యం అందించాలని ఒక వైపు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ లు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే, అధికారుల తీరులో మాత్రం మార్పులు రావడం లేదు. నిత్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లైట్ తీసుకుంటున్నారనే చర్చ ఉన్నది.

హెచ్‌ఓడీ లతో కుమ్మక్కు..?

హాస్పిటళ్ల నిర్వహణ, శానిటేషన్, సెక్యూరిటీ, అంబులెన్స్,అడ్వాన్స్‌డ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్‌తో ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగిస్తోంది. కానీ ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిబంధనలను బొందపెడుతున్నాయి. రికార్డుల్లో వందల మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నట్లు చూపిస్తూ, క్షేత్రస్థాయిలో సగం మందితోనే నెట్టుకొస్తున్నారు. అంతేగాక వార్డులు,ఆపరేషన్ థియేటర్లను ఎప్పటి కప్పుడు ప్రత్యేక కెమికల్స్ తో శుభ్రం చేయాల్సి ఉండగా,కేవలం నీళ్లతో కడిగేసి చేతులు ఎత్తేస్తున్నారు. ఇక లోపాలను ఎత్తిచూపాల్సిన కొందరు ఆస్పత్రి హెచ్‌ఓడీలు, అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కుమ్మక్కై బిల్లులు ఓకే చేస్తున్నారని స్వయంగా కొందరు డాక్టర్లే ఆరోపిస్తున్నారు. ఇక సీటీ స్కాన్, ఎంఆర్ ఐ, వెంటిలేటర్లు, డయాలసిస్ యూనిట్లు లోని మిషన్లను కూడా సకాలంలో మరమ్మత్తులు చేపించడం లేదు. పరికరాల యాన్యువల్ మెయింటెనెన్స్ లను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీ ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ , శానిటేషన్ ఆడిట్‌లు వంటివి సీరియస్ గా జరగడం లేదు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కాలం చెల్లిపోయినా పట్టించుకునే వారు కూడా లేరనే విమర్శలు వస్తున్నాయి.

కీలక ఆసుపత్రుల్లో కూడా..

Advertisement

గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లోనూ రెగ్యులర్ మెయింటనెన్స్ సరిగ్గా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర విభాగాలు, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు బంద్ కావడం, మెయింటెనెన్స్ లేక లిఫ్టులు మధ్యలోనే ఆగిపోవడం వంటి సంఘటనలు కూడా గతంలో జరిగాయి.అంతేగాక ఎంజీఎం వంటి ఆసుపత్రులలో గతంలో ఎలుకలు కోరికేసి ఐసీయులోని రోగి మృతి చెందడం, డ్రైనేజీ నీరు వార్డుల్లోకి చేరడం, ఐసీయూలో ఫ్యాన్లు,ఏసీలు పనిచేయక రోగులు నరకం చూడటం వరకు అనేక ఘటనలు వెలుగుచూశాయి.కొన్ని ఆసుపత్రులలో ఫ్యాన్లు ఊడిపోవడం, స్లాప్ పెచ్చులూడిపోవడం వంటివి కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ ఉన్నతాధికారుల్లో సీరియస్ నెస్ కనిపించడం లేదు. జిల్లా దవాఖాన్లలో ని మెయింటెనెన్స్ మరీ దారుణంగా ఉన్నది.

Also read: అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

ప్రత్యేక నిధులు కేటాయించాలి.. టీజీజీడీఏ..

Advertisement

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం లో జరిగిన అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు మృతి చెందడం అత్యంత విషాదకరమని, మృత శిశువు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రగాఢ సానుభూతి తెలియచేసింది. గాయపడిన ఇతర శిశువులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘటనకు గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ఆ సంఘం అధ్యక్షుడు బీ నరహరి, స్టేట్ సెక్రటరీ లాలు ప్రసాద్ రాథోడ్, స్టేట్ కోశాధికారి ఏ లక్ష్​మీనారాయణ కోరారు. అయితే ఈ ఘటనకు కేవలం వ్యక్తులను బాధ్యులుగా నిలపడం కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న మౌలిక సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

భద్రతా చర్యలు..

ముఖ్యంగా, ప్రభుత్వ ఆసుపత్రులకు రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు నెలల తరబడి విడుదల కాకపోవడం వల్ల వైద్య పరికరాల నిర్వహణ, బయోమెడికల్ పరికరాల సర్వీసింగ్, విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, అగ్నిమాపక భద్రతా చర్యలు, అత్యవసర వినియోగ సామగ్రి కొనుగోలు వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయన్నారు. ఈ పరిస్థితి రోగుల భద్రతకు కూడా ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్ ఎన్ సీయూ, ఎన్ ఐసీయూ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు వంటి అత్యవసర విభాగాల్లో పరికరాల నిర్వహణకు తగిన నిధులు అందించాలన్నారు.

Also read: తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Tags

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల అక్రమ తవ్వకాలపై కేసు నమోదు!

కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!

మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

ఫలించిన పాలమూరు రైతుల పోరాటం.. జూరాల నుంచి సాగునీరు విడుదల!

Big Stories

Advertisement
×