E-Paper
Advertisement

మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!

మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన తండ్రి సినిమా కెరియర్ గురించి ఇండస్ట్రీలో చిరంజీవి 48 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన సరిగ్గా ఇండస్ట్రీలోకి వచ్చి 48 సంవత్సరాలు పూర్తి కావడంతో చిరంజీవి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేశారు.

ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం…

ఇలా చిరంజీవి 48 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మెగా కుటుంబ సభ్యులు కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. అయితే తాజాగా రాంచరణ్(Ram Charan) సైతం తన తండ్రి చేసిన పోస్టును రీపోస్టు చేస్తూ..” నాన్న సినిమా రంగంలోకి అడుగుపెట్టి 48 సంవత్సరాలు అయ్యింది.మీ జీవితాన్ని, మా కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మేము ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మీరు చేసిన ప్రతిదానికీ నేను ఎంతో కృతజ్ఞుడను, అలాగే మీపై ఎల్లప్పుడూ ప్రేమను, అండదండలను చూపిస్తున్న ప్రేక్షకులకు కూడా…మీ ప్రయాణం ఎప్పటికీ మాకు స్ఫూర్తిదాయకం. ఇప్పుడు సినిమా రంగంలో మీ 50 ఏళ్ల అద్భుతమైన మైలురాయిని జరుపుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.

కాకా పనులలో బిజీగా చిరు..

Advertisement

ఇలా సినీ ప్రయాణం పై రాంచరణ్ స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఇప్పటికీ పోటాపోటీగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కాకా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు విశ్వంభర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి అయ్యాయి. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజ కార్యక్రమాలతో షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు అనగానే ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎలాంటి బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read: రెండు జడలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? టాలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్?

Related News

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

ఆ రోజు చిన్న రోల్.. ఈ రోజు వంద కోట్ల సినిమా.. సుహాస్ జర్నీ ఇదే!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలతకు షాక్..రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు!

రెండు జడలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? టాలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్?

ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

Big Stories

Advertisement
×