E-Paper
Advertisement

చివరి ఓవర్‌లో వైడ్‌పై వివాదం..అంపైర్‌తో గొడవకు దిగిన అక్షర్, శ్రేయాస్ అయ్యర్

చివరి ఓవర్‌లో వైడ్‌పై వివాదం..అంపైర్‌తో గొడవకు దిగిన అక్షర్, శ్రేయాస్ అయ్యర్
Advertisement

Axar Patel Wide Controversy:  జపాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ నేపథ్యంలో సరికొత్త వివాదం రాజుకుంది. జపాన్ ఛేజింగ్ చేస్తున్న క్రమంలో చివరి ఓవర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో జపాన్ ఆటగాడు అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ (Alexander Shirai-Patmore ) రివర్స్ స్వీప్ ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. దీంతో అక్షర్ పటేల్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రివ్యూ తీసుకునే ఛాన్స్ ఈ మ్యాచ్ లో లేకపోవడంతో, అంపైర్ ను నిలదీశారు. ఈ క్రమంలో మొదట వైడ్ ఇచ్చిన అంపైర్, రిప్లైలో పరిశీలించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కౌంట్ బాల్ గా ట్రీట్ చేస్తూ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జపాన్, 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై రకరకాల చర్చ జరుగుతోంది. అంపైర్లను బెదిరించి, వైడ్ బాల్ ను కౌంట్ గా మార్చారని టీమిండియా క్రికెటర్లపై పోస్టులు పెడుతున్నారు.

అంపైర్‌తో గొడవకు దిగిన అక్షర్, శ్రేయాస్ అయ్యర్

టీమిండియా వర్సెస్ జపాన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ 5 ఓవర్లకు ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఛేజింగ్ కు దిగిన జపాన్ క్రికెట్ జట్టు, గెలించేంత పని చేసింది. కానీ చివరి ఓవర్ లో మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. బాపూ అక్షర్ పటేల్ చివరి ఓవర్ లో అదరగొట్టిన తరుణంలో టీమిండియా సాధించింది. ఈ ఓవర్ లో అక్షర్ పటేల్ వేసిన ఓ బంతిని జపాన్ ఆటగాడు అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ రివర్స్ స్వీప్ ఆడాడు. దీనిని మొదట అంపైర్ వైడ్ గానే ప్రకటించారు. కానీ అక్షర్ పటేల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంపైర్ ను నిలదీశారు. దీంతో మరోసారి రిప్లై చూసిన అంపైర్, బ్యాటర్ పోజిషన్ మార్చిన విషయాన్ని గమనించి, బంతి కౌంట్ అని ప్రకటించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న టీమిండియా విక్టరీ సాధించింది. ఈ బాల్ గనుక వైడ్ వెళ్లింటే, మ్యాచ్ జపాన్ గెలిచేది. అంటే జస్ట్ లో మిస్ అయిందన్న మాట.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

2 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా

జపాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్ లో చివరకు 2 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 32 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో పోరాడి ఓడిపోయింది జపాన్. 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

 

 

 

 

 

 

Tags

Related News

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో తాను ఆడింటే, నా త‌ల‌రాత మారేంది

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని టీమిండియా ఆడుతుంది..అందుకే ఈ సారి ఓడిస్తాం

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం

మా పాకిస్తాన్ ప్లేయర్లు కోతుల కంటే దారుణం… వాటి కంటే ఎక్కువ అరటి పండ్లు మెక్కుతున్నారు !

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?

Big Stories

Advertisement
×