E-Paper
Advertisement

యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!

యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!
Advertisement

iPhone Ultra: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ప్రొడక్ట్.. ఫోల్డబుల్ ఐఫోన్. ఈ పవర్‌ఫుల్ ఫోన్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను ‘ఐఫోన్ అల్ట్రా’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. రాబోయే సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఈ ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో ఐఫోన్ అల్ట్రాకు సంబంధించిన ఒక బ్లాక్ కలర్ డమ్మీ యూనిట్ ఫొటోలు లీకై, టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేపుతున్నాయి.

ఐప్యాడ్ మినీ తరహా డిజైన్:

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఐఫోన్ అల్ట్రాను పూర్తిగా విప్పినప్పుడు అది ఒక చిన్న ఐప్యాడ్ మినీలా కనిపిస్తుంది. సాధారణ ఫోన్లతో పోలిస్తే ఇది కాస్త వెడల్పుగా, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మోడల్‌కు గట్టిపోటీ ఇచ్చేలా, అంతే సన్నగా, కాంపాక్ట్‌గా దీనిని యాపిల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరాలు, బటన్ల అమరిక:

Advertisement

ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో కెమెరాల అమరిక చాలా భిన్నంగా ఉంది. వెనుక వైపు మాత్రల (పిల్) ఆకారంలో ఉండే మోడ్యూల్‌లో రెండు కెమెరాలను అడ్డంగా అమర్చారు. వీటితో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్, మైక్రోఫోన్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం బయటి స్క్రీన్‌పై ఒకటి, లోపలి స్క్రీన్‌పై మరొకటి చొప్పున రెండు ఫ్రంట్ కెమెరాలను ఇచ్చారు. ఇక ఫోన్ కుడివైపున పవర్ బటన్ కింద ‘కెమెరా కంట్రోల్’ బటన్, పైభాగంలో వాల్యూమ్ కీస్, కింద యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Also Read: స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!

స్క్రీన్ సైజ్, డిస్‌ప్లే:

Advertisement

ఐఫోన్ అల్ట్రా యూజర్లకు సరికొత్త టాబ్లెట్ అనుభూతిని అందించనుంది. ఇందులో 5.3 ఇంచుల ఔటర్ డిస్‌ప్లేతో పాటు, లోపల వైపు 7.8 ఇంచుల పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్‌ను అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల మల్టీటాస్కింగ్ మరియు వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ అనుభవం అద్భుతంగా ఉంటుంది.

పవర్‌ఫుల్ ఫీచర్లు:

టెక్నాలజీ పరంగా ఈ ఫోన్ చాలా బలంగా ఉండబోతోంది. దీనిలో యాపిల్ సరికొత్త ఏ20 ప్రో చిప్‌సెట్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 12GB RAM, వెనుక వైపు రెండు 48MP కెమెరాలు, యాపిల్ సొంత సి2 మోడెమ్‌ను ఇందులో చేర్చే అవకాశం ఉంది. ఏదేమైనా యాపిల్ నుంచి రాబోతున్న ఈ మొదటి ఫోల్డబుల్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఐకూ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఐకూ 16 అల్ట్రా రావడం లేదు, ఎందుకో తెలుసా?

Related News

ఈ పోర్టబుల్ బ్లెండర్‌తో..హెల్దీ జ్యూస్, స్మూతీలు క్షణాల్లో రెడీ

రూ.482కే..పోర్టబుల్ జ్యూసర్, వెంటనే కొనేయండి

సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×