E-Paper
Advertisement

ఒరిజినల్ ‘ఉడిపి’ హోటల్ ఎక్కడుంది? ఇది ఎందుకంత ప్రత్యేకం?

ఒరిజినల్ ‘ఉడిపి’ హోటల్ ఎక్కడుంది? ఇది ఎందుకంత ప్రత్యేకం?
Advertisement

Untold Story Of Famous Udupi Hotels: ఇడ్లీ, దోశ, వడ, సాంబార్, ఫిల్టర్ కాఫీ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు ఉడిపి హోటల్. సౌత్ ఇండియాలోని చాలా నగరాల్లో ఉడిపి హోటళ్లు కనిపిస్తాయి. చక్కటి శాకాహారం అందించడంలో ఈ హోటల్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే, ఒరిజినల్ ఉడిపి హోటల్ ఎక్కడుంది? దాని సక్సెస్ స్టోరీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నిజానికి అది హోటల్ కాదట!  

నిజానికి  ‘ఉడిపి’ అనేది ఒక కంపెనీ లేదంటే ఒక వ్యక్తికి చెందిన బ్రాండ్ కాదు. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం నుంచి వచ్చిన ప్రత్యేకమైన శాఖాహార వంటకాల సంప్రదాయానికి గుర్తుగా ఈ పేరు మారింది. ఇంకా చెప్పాలంటే, ఉడిపి వంటకాల చరిత్ర కర్ణాటక తీర ప్రాంతంలోని ప్రసిద్ధ శ్రీ కృష్ణ మఠంతో ముడిపడి ఉంది. ఈ మఠం చుట్టూ ఏర్పడిన వంట సంప్రదాయంలో సాత్విక ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. భక్తులకు భోజనం తయారు చేసే సమయంలో శుభ్రత, రుచి, ఈజీగా జీర్ణమయ్యే పదార్థాల వినియోగం లాంటి అంశాలను పాటించేవారు. ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి వాడకుండా కూడా రుచికరమైన వంటకాలు తయారు చేయడం ఈ వంటశైలిలో ప్రత్యేకం. కొబ్బరి, ఇంగువ, జీలకర్ర, స్థానిక కూరగాయలు, అరటికాయలు లాంటి పదార్థాలతో అద్భుతమైన రుచులను తయారు చేసే వారు. తక్కువ పదార్థాలతో మంచి రుచి తీసుకురావడమే ఉడిపి వంటకాల అసలు ప్రత్యేకత.

ఆయా నగరాలకు వెళ్లిన ఉడిపి వంట మనుషులు

Advertisement

కాలం గడుస్తున్న నేపథ్యంలో ఉడిపి ప్రాంతానికి చెందిన చాలా మంది ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లారు. తమకు తెలిసిన సంప్రదాయ వంటకాలతో చిన్న కాఫీ క్లబ్‌లు, టిఫిన్ సెంటర్లు ప్రారంభించారు. బెంగళూరులో చిన్న హోటళ్లుగా ప్రారంభమైన ఈ సంప్రదాయం తర్వాత పెద్ద స్థాయికి చేరుకుంది. చెన్నై, హైదరాబాద్ లో కూడా ఉడిపి ప్రాంతానికి చెందిన వ్యాపారులు కాఫీ హౌస్‌లు, శాకాహార రెస్టారెంట్లు ప్రారంభించారు. ముంబైలోనూ ఉడిపి వంటలకు చాలా మంచి గుర్తింపు ఉంది.

ఉడిపి హోటళ్లు ఎందుకు ఇంత పాపులర్?  

ఉడిపి హోటళ్ల విజయానికి ప్రధాన కారణం.. ఎక్కువ ఖర్చు లేకుండా, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో మంచి ఆహారాన్ని అందించడం. వేడివేడిగా ఇడ్లీ, క్రిస్పీ దోశ, రుచికరమైన సాంబార్, కొబ్బరి చట్నీ, చివరగా సువాసనలు వెదజల్లే ఫిల్టర్ కాఫీ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే త్వరగా వడ్డించడం కూడా ఈ హోటళ్ల ప్రత్యేకత.

ఉడిపి బ్రాండ్ కాదు.. సంప్రదాయం!

Advertisement

ఉడిపి ప్రాంత శాకాహార వంట సంప్రదాయాన్ని అనుసరించే అనేక హోటళ్లు ఈ పేరును ఉపయోగిస్తుంటాయి. ఒకప్పుడు దేవాలయ వంటశాలలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అందుకే ఉడిపి అనేది కేవలం హోటల్ పేరు కాదు. అది దక్షిణ భారతీయ రుచి, సంప్రదాయం, శుభ్రత, తక్కువ ధరల కలయికకు ఒక ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు.

Read Also: గుడిని చుట్టుకున్న చేప.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Tags

Related News

దెయ్యాల కోటలు.. దేశంలోని ఈ హిల్ స్టేషన్లలో పిశాచాలు ఉన్నాయట.. వెళ్లడానికి ధైర్యముందా?

రోజంతా కొండపై కూర్చుంటాడు.. నెలకు రూ.8.5 లక్షలు సంపాదిస్తాడు?

గుడిని చుట్టుకున్న చేప.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఏఐ To బయోమెట్రిక్.. స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌.. గ్లోబల్ కనెక్టివిటీ!

ప్యారిస్ వెళ్లాల్సిన పనిలేదు.. హైదరాబాద్‌లోనే ఐఫిల్ టవర్‌పై కూర్చొని ఐస్‌క్రీమ్ తినొచ్చు!

ఇక ఉబెర్ యాప్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్.. PNR స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు!

చిక్కుల్లో నవదీప్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?

Big Stories

Advertisement
×