Prabhas Salaar 2 Update:ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టాప్ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్.ఏకంగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి మరి.అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ఒక వైపు ఫౌజీ,మరో వైపు స్పిరిట్,ఇంకో వైపు కల్కి 2898AD వంటి సినిమాలని ప్రస్తుతం సెట్స్ పై పరుగులు పెట్టిస్తూ యమా జోరు చూపిస్తున్నాడు.
అంతా బాగానే ఉంది ఒక్క సలార్ 2 సినిమా విషయంలోనే ఫ్యాన్స్ ని బాగా కన్ఫ్యూజన్ కి గురిచేస్తున్నాడు. ఎందుకంటే సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ లలో చూస్తే సినిమాపై ఇచ్చిన హైప్ మాములుగా లేదు మరి. దేవా పాత్రలో ప్రభాస్,వరదరాజ మన్నార్ గా పృధ్విరాజు సుకుమారన్ మధ్య నీల్ డిజైన్ చేసిన బాండింగ్ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశాయి.
పైగా సినిమా చివర్లో దీనికి శౌర్యాంగ పర్వం అంటూ రెండో పార్ట్ కూడా వస్తుందంటూ చెప్పేయడంతో సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి.పైగా ఈ సినిమా ఉండి తీరుతుందని అప్పట్లో హోంబలే ఫిలిమ్స్ కాన్ఫిడెంట్ గా చెప్పింది కూడా.దీంతో ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
ఇక ప్రభాస్ తన వరుస సినిమాలతో బిజీగా ఉంటే అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు.ఇక ఈ సినిమాని వచ్చే ఏడు జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.
అయితే దీని తర్వాత నీల్ KGF 3 ఏమైనా తెరకెక్కిస్తాడా అన్న అనుమానాలు ఆడియన్స్ లో బలంగా నాటుకుపోయాయి.కారణం ఒకానొక సమయంలో నీల్ ఇదే విషయాన్ని రివీల్ చేస్తూ హింట్ ఇవ్వడమే.అయితే ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సలార్ 2 శౌర్యాంగ పర్వాన్ని వచ్చే ఏడు జులై తర్వాత సెట్స్ మీదికి వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.అంటే నీల్ మామ డ్రాగన్ కంప్లీట్ చేసే లోపు , ప్రభాస్ ఇపుడున్న సినిమాలని పూర్తి చేసుకుని రెడీగా ఉంటే అప్పటి కల్లా ఈ సినిమా ఆన్ బోర్డ్ అవుతుంది కాబోలు.
అయితే అనుకున్నంత ఈజీగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చే ఏడు సెట్స్ మీదికి వెళ్ళాలంటే ఇప్పటి నుండే స్క్రిప్ట్ వర్క్, క్యాస్టింగ్ వర్క్ వగైరా అన్నీ మొదలైపోవాలన్న మాట.అయితే వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే శౌర్యాంగపర్వానికి సంభందించిన షూటింగ్ 20 శాతం సలార్ పార్ట్ 1 అప్పుడే కంప్లీట్ చేశారని తెలుస్తుంది.అదే నిజమైతే మాత్రం వచ్చే ఏడు సినిమా మొదలై చివర్లో రిలీజ్ కావడం పెద్ద కష్టమేమి కాదు.కావాల్సిందల్లా పార్ట్ 2 పట్టాలెక్కించాలని నీల్ మనసుకి తట్టడమే!
ALSO READ :బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!
చూడాలి మరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ 2 శౌర్యాంగ పర్వం వచ్చే ఏడైనా వస్తుందా లేక అబ్బే ఇప్పుడే కాదంటూ మరో ఏడాది పోస్ట్ పోన్ చేసుకుంటుందా !