E-Paper
Advertisement

ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!

ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!
Advertisement

Amazon Freedom Sale 2026: మార్కెట్‌లో రోజుకో కొత్త ఫోన్ వస్తున్నా.. గూగుల్ పిక్సెల్ కెమెరా ఇచ్చే ఆ నేచురల్ లుక్ అండ్ ఫీల్ వేరే ఏ ఫోన్ ఇవ్వలేదు. కాకపోతే పిక్సెల్ ఫోన్ల రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ సేల్‌లో Google Pixel 6aపై ఉన్న డిస్కౌంట్ చూస్తే మాత్రం ఈ డీల్ అస్సలు మిస్ అవ్వకూడనిది అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు సగం ధరకే లభిస్తున్న ఈ గూగుల్ ఫోన్ ఆఫర్ వివరాలు చూద్దాం.

ధర భారీగా తగ్గింపు:

భారత్‌లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.43,999గా ఉండేది. కానీ ఈ సేల్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను ఏకంగా రూ.22,999కే అందిస్తున్నారు. అంటే.. అసలు ధర కంటే దాదాపు రూ.21,000 తక్కువకే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ Google Pixel 6a ఫోన్ 6.1 ఇంచుల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. వీడియోలు చూడటానికి, సోషల్ మీడియా వాడకానికి ఇది చాలా బాగుంటుంది. గూగుల్ సొంతంగా తయారు చేసిన ‘టెన్సర్’ ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది ఫోన్ పనితీరును వేగవంతం చేయడమే కాకుండా.. ఫొటోగ్రఫీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు బాగా సహకరిస్తుంది.

Also Read: ట్రావెలింగ్‌లో మీ ఫోన్ హ్యాక్ అవ్వకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఈ రూల్ పాటించండి!

అద్భుతమైన కెమెరా క్వాలిటీ:

Advertisement

పిక్సెల్ ఫోన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కెమెరానే. దీని వెనుక వైపు 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. మెగాపిక్సెల్స్ సంఖ్య తక్కువగా అనిపించినా.. గూగుల్ ఇమేజ్ ప్రోసెసింగ్ వల్ల ఫొటోలు చాలా నాణ్యతగా, నాచురల్‌గా వస్తాయి.

బ్యాటరీ, స్టోరేజ్ వివరాలు:

Google Pixel 6a ఫోన్‌లో 4,410mAh బ్యాటరీని అందించారు. రోజువారీ సాధారణ వాడకానికి ఇది సరిపోతుంది. అలాగే 128GB స్టోరేజ్ ఉంది కాబట్టి.. సాధారణ వినియోగదారులకు ఫోటోలు, యాప్స్ స్టోర్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈ డీల్‌లో కొనుగోలు చేయొచ్చా?

తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం కావాలనుకుంటే పిక్సెల్ 6a మంచి ఎంపిక. అయితే ఇది కొంచెం పాత మోడల్ కాబట్టి.. కొనేముందు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, వారంటీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మంచి బ్రాండెడ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలనుకునేవారికి ఈ డీల్ ఖచ్చితంగా వర్త్ అని చెప్పవచ్చు.

Also Read: అఫీషియల్ లాంచ్ కంటే ముందే లీక్.. Xiaomi 18 Pro, Redmi 17 సిరీస్ రిలీజ్ డేట్స్ ఇవే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×