E-Paper
Advertisement

హీరోయిన్ రాధికకి కూడా తప్పని డబ్బా తిప్పలు.. నిరూపించుకున్నారు మేడం!

హీరోయిన్ రాధికకి కూడా తప్పని డబ్బా తిప్పలు.. నిరూపించుకున్నారు మేడం!
Advertisement

Radhika Sarath Kumar: సూర్య(Suriya )హీరోగా, వెంకీ అట్లూరి (Venky atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ సుమ (Suma) చిత్రబృందంతో కలసి నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నవ్వులు పూయిస్తోంది. సూర్య, రాధికా శరత్‌కుమార్, మమిత బైజు, వెంకీ అట్లూరి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో సుమ తెచ్చిన స్వీట్లు, జంతికల డబ్బా హంగామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇంటర్వ్యూలో సుమ స్వీట్ల హంగామా:

ఇంటర్వ్యూ సందర్భంగా సుమ మూవీ టీమ్‌కు రకరకాల పిండివంటలు పంచి సందడి చేసింది. పూతరేకులు, బందర్ హల్వా, కాజా, జంతికలు అంటూ సందడి మొదలుపెట్టింది. డైరెక్టర్ వెంకీ అట్లూరికి స్వీట్స్ ఇస్తుంటే.. ఆయన ‘నేను ఓన్లీ హాట్ మాత్రమే తింటాను’ అని అనడంతో జంతికల బాక్స్ ముందుకు తీసింది. ఎప్పటిలాగే తన మార్క్ హ్యూమర్‌తో ఇంటర్వ్యూని సరదాగా మార్చేసింది.

Advertisement

also read:హీరో శ్రీకాంత్ డైలీ ఇంట్లో ఇలాగే చేస్తారా?

డబ్బా తిప్పలు.. రాధిక పంచ్:

సీనియర్ నటి రాధికకు జంతికలు ఇచ్చిన తర్వాత సుమ ఎప్పటిలాగే “తిన్న తర్వాత డబ్బా మాత్రం తిరిగి ఇచ్చేయండి” అని అనడంతో నవ్వులు విరిశాయి. ఇక వెంటనే దానికి రాధిక స్పందిస్తూ “ఈ డబ్బా గొడవ ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమే, డబ్బా కన్ఫర్మ్ గా వెనక్కి తీసుకెళ్లాల్సిందే” అని నవ్వుతూ చెప్పారు. దీంతో సూర్యతో సహా అక్కడున్న మూవీ టీమ్ అంతా గట్టిగా నవ్వేశారు.

హ్యాట్రిక్ దిశగా వెంకీ అట్లూరి:

Advertisement

మరోవైపు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై తెలుగు, తమిళంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్లను అందించిన వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్, సూర్య క్లాస్ లుక్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇలాంటి సరదా ప్రమోషన్లు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సూర్య మార్క్ యాక్టింగ్, మమిత అల్లరి, రాధికా సీనియారిటీ తోడై ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపించేలా ఉంది. ఇక ఆగస్ట్ 14న వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×