Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (PAKISTAN Vs Team INDIA CLASH ) మహిళల జట్ట మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఆదివారం రోజున ఎడ్జ్ బస్టన్ వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాగా… ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ చేజింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా మరోసారి వివాదాస్పద సంఘటన జరిగింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ షేక్ హ్యాండ్ (NO HANDSHAKE) ఇవ్వకుండా అవమానించింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (ICC Women’s T20 World Cup 2026 tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK ) మధ్య ఎడ్జ్ బస్టన్ వేదికగా ఆదివారం మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. పహాల్గమ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు టీమిండియా ఆటగాళ్లు ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫాతిమాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే… వెళ్ళిపోయింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. దీంతో వివాదం రాజుకుంది.
అయితే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా సనా ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించిందని.. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం ఇండియాకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లపై పర్మనెంట్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిసిసిఐ కూడా క్షమాపణలు చెప్పాలని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్. గతంలో సూర్య కుమార్ యాదవ్ ఇలాగే సల్మాన్ అలీ, పాకిస్తాన్ క్రికెట్ జట్టును అవమానించాడని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు కూడా ఇదే అవమానం జరిగిందని మండిపడ్డారు.
No handshake today also #IndWvpakW#indwvspakW pic.twitter.com/VaYz8fwnzF
— यार हरियाणा के (@Haryanviiiii) June 14, 2026