E-Paper
Advertisement

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!
Advertisement

Jana Sena Telangana: జనసేన పార్టీని తెలంగాణలో గ్రాస్ రూట్ స్థాయి నుండి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ బలోపేతమే ప్రాథమిక లక్ష్యంగా తెలంగాణ జాయినింగ్ కమిటీకి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వెలువరించిన ఈ నూతన ప్రణాళికలో ముఖ్యంగా చేరికల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు.

చేరికలపై కఠిన నిబంధనలు

Advertisement

పార్టీలోకి కొత్తగా వచ్చే నాయకులు, కార్యకర్తలు జనసేనకు నిజమైన బలంగా నిలవాలని కమిటీకి సూచించారు. పార్టీని కేవలం తమ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలని చూసే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, బాధ్యతాయుతంగా పనిచేసే వారిని మాత్రమే సాధరంగా ఆహ్వానించాలని స్పష్టం చేశారు.

పూర్తి వివరాల పరిశీలన తప్పనిసరి

Advertisement

పార్టీలో చేరాలనుకునే వ్యక్తి నేపథ్యం, వారి గత రాజకీయ చరిత్రను ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చేరికలపై తుది నిర్ణయం తీసుకోవాలి. చేరే ప్రతి ఒక్కరికి రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో పాటు, జనసేన మూల సిద్ధాంతాలపై పూర్తి పట్టు ఉండటం తప్పనిసరి చేశారు.

కార్యాచరణలో భాగస్వామ్యం

కేవలం కండువా కప్పుకోవడానికే పరిమితం కాకుండా, పార్టీలో చేరిన కొత్త నాయకులు, కార్యకర్తలు పార్టీ నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యతను తెలంగాణ జాయినింగ్ కమిటీకే అప్పగించారు. ఇందుకోసం కమిటీ సభ్యులకు కొత్త చేరికలపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలని ఆదేశించారు.

అధ్యక్షుడే తుది నిర్ణేత

తెలంగాణలో రాబోయే రోజుల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపిక, అలాగే పోటీలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిదే అంతిమ నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తేల్చిచెప్పింది. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Also Read: చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

Tags

Related News

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

Big Stories

Advertisement
×