E-Paper
Advertisement

Rajinikanth: 100 జన్మలైనా అలాగే పుట్టాలి… రజనీకాంత్ ఎమోషనల్ !

Rajinikanth: 100 జన్మలైనా అలాగే పుట్టాలి… రజనీకాంత్ ఎమోషనల్ !
Advertisement

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడుపదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయిన నేపథ్యంలో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025(IFFI 2025) వేడుకలలో రజనీకాంత్ కు ప్రత్యేకమైన గౌరవం లభించిన సంగతి తెలిసిందే.

100 ఏళ్లు అయిన నటుడిగానే పుట్టాలి..

ఇఫి ముగింపు వేడుకలలో భాగంగా కేంద్రమంత్రి ఎల్ మురుగన్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ రజనీకాంత్ ను చాలువాతో సత్కరించి రజనీకాంత్ కు జ్ఞాపికను అందజేశారు. ఇక ఈ ముగింపు వేడుకలో భాగంగా రజనీకాంత్ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.”50 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి అయినప్పటికీ తనకేదో 10 సవత్సరాల కెరియర్ పూర్తి అయిందనే భావన ఉందని తెలిపారు.ఒకవేళ నాకంటూ మరో 100 జన్మలు ఉంటే కచ్చితంగా ఈ 100 జన్మలు కూడా తాను ఒక నటుడిగా పుట్టాలని కోరుకుంటాను అంటూ “రజనీకాంత్ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

ఇఫీ వేడుకలలో లాల్ సలాం సినిమా ప్రదర్శన..

Advertisement

ఇక ఇఫీ ముగింపు వేడుకలలో భాగంగా రజనీకాంత్ హీరోగా నటించిన లాల్ సలాం(Lal Salaam) సినిమాను హాజరైన వారి కోసం ప్రదర్శించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ ప్రదర్శనలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవంలో ఈ సినిమాని ప్రదర్శించిన నేపథ్యంలో రజిని కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ అలాగే చిత్ర నిర్మాతలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.2024లో విడుదలైన లాల్ సలామ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే.

జైలర్ 2 పనులలో బిజీగా రజినీకాంత్..

Advertisement

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంద జన్మలైనా నటుడుగానే పుట్టాలని కోరుకుంటున్నారు అంటే నటన పట్ల సినిమాల పట్ల ఆయనకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే ఈయన చివరిగా కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు… ఈ సినిమా ద్వారా సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2(Jailer 2) పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉందని త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది.

Also Read: Pushpa 2: మళ్లీ థియేటర్లలోకి పుష్ప 2… ఒక్క షోనే అస్సలు మిస్సవద్దు!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×