BigTV English

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Rajinikanth: కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పదాలు కూడా ఒక వాక్యంలోనే అర్ధాన్ని మార్చేస్తాయి. అందుకే కొన్ని మాటలు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి అని అంటుంటారు మన పెద్దలు. అలానే ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న క్యారెక్టర్ కూడా కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు వలన స్పాయిల్ అయిపోతుంది. అందుకే చాలామంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మన నాలుకెప్పుడు మన ఆధీనంలో ఉండాలి అని కొన్ని మాటలు చెబుతూ ఉంటారు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు వాళ్ళ కెరియర్ ను బాగా డామేజ్ చేశాయి. రీసెంట్ టైమ్స్ లో రాజేంద్రప్రసాద్ ఎన్నో కాంట్రవర్సీలు ఫేస్ చేశారు. యంగ్ హీరో విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మాట్లాడిన కొన్ని మాటలు వల్లే తీవ్రమైన నెగెటివిటీని ఫేస్ చేశాడు. ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు. అందుకే అప్పట్లో సీనియర్ హీరోలు అంతా ప్రేక్షకు దేవుళ్ళు అంటూ అభిమానులను సంబోధించేవాళ్ళు.

నువ్వొక సూపర్ స్టార్‌‌వా?


సూపర్ స్టార్ అనగానే ఇండియాలో గుర్తొచ్చే మొదటి పేరు రజనీకాంత్. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా తనను ఓన్ చేసుకున్నారు. ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవడమే కాకుండా, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సాధించారు రజినీకాంత్. అయితే రజినీకాంత్ కూలీ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నువ్వు సూపర్ స్టార్ వా అంటూ చాలామంది కామెంట్ చేయడం మొదలు పెడుతున్నారు.

ఇంతకు ఏమైంది.?

లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా కూలీ. ఈ సినిమా కథను లోకేష్ చెప్పినప్పుడు దీనికి చాలామంది స్టార్ కాస్ట్ కావాలి అని రజనీకాంత్ తో చెప్పారట. అయితే దీంట్లో ఒక కీలకమైన పాత్రను రజనీకాంత్ కు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది విన్న వెంటనే ఈ పాత్రను పాహద్ ఫాజిల్ చేస్తాడేమో అనుకున్నారు రజినీకాంత్. అయితే ఫహద్ ఫాజిల్ బిజీగా ఉండడం వలన దీనిని సౌబిన్ చేస్తారు అని లోకేష్ రజనీకాంత్ కు చెప్పారు.

సౌబిన్ ఆ.? అతనెవరు ఇంతకుముందు ఏ సినిమాలు చేశాడు అని ప్రశ్నించాడు.? మంజుమల్ బాయ్స్ అని చెప్పాడు లోకేష్. అయితే చూడటానికి చాలా పొట్టిగా ఉన్నాడు. బట్టతల ఉంది ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయగలుగుతాడా అని నేను అనుకున్నాను. నాకు అసలు నమ్మకం లేదు. కానీ నన్ను నమ్మండి సార్ బాగా చేస్తాడు అని లోకేష్ చెప్పాడు.

అని సౌబిన్ గురించి మాట్లాడే తరుణంలో చెప్పారు రజినీకాంత్. ఇక్కడితో సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది. బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా? అంటూ రజనీకాంత్ ని పర్సనల్ గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజెన్లు.

Also Read: Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Related News

Varsha Bollamma :సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!

Big Stories

×