E-Paper
Advertisement

Peddi Song: ‘రై రై రా రా’.. 300 మంది డాన్సర్ల మధ్య చరణ్ విశ్వరూపం. ‘KCPD’నే!

Peddi Song: ‘రై రై రా రా’.. 300 మంది డాన్సర్ల మధ్య చరణ్ విశ్వరూపం. ‘KCPD’నే!
Advertisement

Peddi Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi Movie). రామ్ చరణ్ 16వ చిత్రమిది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) సాంగ్ ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కాంబోలో వచ్చిన ఆ సాంగ్, రిలీజైన నిమిషం నుంచే శ్రోతల హృదయాలను దోచేసింది. ఇప్పుడు రెండో సాంగ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో వచ్చిన తాజాగా అప్డేట్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తుంది. అదేంటంటే..

Also Read- Vijay Rashmika: సొంత గ్రామానికి విజయ్ రష్మిక .. గ్రామస్తులందరికీ పసందైన భోజనం!

‘పెద్ది’ సెకండ్ సాంగ్ అప్డేట్- Peddi Song

Advertisement

‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంత రస్టిక్‌గా ఉంటుందో, పాటలు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నాయి. ఆ విషయం ‘చికిరి చికిరి’నే హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు రాబోయే ‘రై రై రా రా’ అనే సాంగ్ కోసం చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 300 మంది ప్రొఫెషనల్ డాన్సర్ల మధ్య చరణ్ తనదైన గ్రేస్‌తో స్టెప్పులు ఇరగదీశారట. ‘మగధీర, రంగస్థలం’ సినిమాల్లో చరణ్ డాన్స్ చూసి ఫిదా అయిన అభిమానులకు, ఈ పాట మళ్ళీ ఆ రోజులను గుర్తు చేయబోతోందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ ఎనర్జీ చూస్తుంటే ఇది కేవలం పాట మాత్రమే కాదు, థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగలా ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతోంది.

Also Read- Vijay vs Sangeetha Net Worth: విజయ్ vs సంగీత.. ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందంటే..?

KCPD రేంజ్‌లో మాస్ సెలబ్రేషన్స్!

Advertisement

ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ KCPD అనే రేంజ్‌లో ఉండబోతోందని అంటున్నారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా రా అండ్ రస్టిక్ స్టెప్పులతో చరణ్ విశ్వరూపం చూపించబోతున్నారట. ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. సోమవారం రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ఈ పాటను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్టిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 300 మంది డాన్సర్లతో అత్యంత భారీగా ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది. అలాగే ఏఆర్ రెహమాన్ మరోసారి తన మార్స్ ప్రదర్శించారనేలా పాట విన్నవాళ్లంతా రియాక్ట్ అవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్‌కు తగ్గట్టుగా, బుచ్చిబాబు ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ పాటతో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని చిత్రయూనిట్ కూడా భావిస్తోంది. చూద్దాం మరి పాట ఎలా ఉంటుందో..

Also Read- Peddi Second single: పెద్ది సెకండ్ సింగిల్ ప్రోమో.. ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇవ్వనున్న టీమ్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×