Telangana Jagruthi: ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం, సంస్కృతిక అభివృద్ధి, యువత శక్తి పెంపు లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నార్వే మూడు విదేశీ దేశాల శాఖలకు నూతన కార్యవర్గ అధికారులను నియమించారు. ఈ నియామకాలు కేవలం పదవుల ప్రకటన కాదు, విదేశాల్లోని తెలంగాణ వాసుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపగలగడం, వారి సంప్రదాయాల పరిరక్షణ, కొత్త అవకాశాల సృష్టి కోసం జాగృతి తీసుకున్న ముందడుగుగా అనిపిస్తుంది.
Also read: Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్
ఈ నియామకాలను కవిత శనివారం ఉదయం, అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఖరారు చేశారని సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా జాగృతి తమ ప్రవాస తెలంగాణా నీకుల సంక్షేమానికి, సంస్కృతిక అభివృద్ధికి మరింత శక్తిసామర్థ్యంతో పనిని అమలు చేయడం అని అర్థమవుతుంది.అలాగే యువత, మహిళలు, క్రీడల రంగంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కొత్త బాధ్యులను నియమించడం అనేది, కొత్త ఆలోచనతో, కొత్త ఉద్దేశంతో పని చేయబోతున్నారనే సంకేతం.
Also read:Madhavan: అవసరమైతే తప్ప ఆ పని చేయను.. రజనీకాంత్ గారి నుంచే నేర్చుకున్నా!
తెలంగాణ జాగృతి – సౌత్ ఆఫ్రికా శాఖ కోసం ఎంపిక చేసిన సభ్యులు..
* అధ్యక్షురాలు : హరీష వూరె
* ఉపాధ్యక్షులు :సతీష్ రావు మర్రు
* ఉపాధ్యక్షులు : గోవింద్ జ్యోతిర్మయి
* ప్రధాన కార్యదర్శి: వెంకటరమణ గౌడ్ అంతటి
* సంయుక్త కార్యదర్శి: శివకుమార్ తాముశెట్టి
* ట్రెజరర్: సందీప్ ఖండె
* మహిళా ఇంచార్జి: రాధిక వేముల
* సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జి: సుఖేష్న వీరబోయిన
* యూత్-మీడియా ఇంచార్జి: సాయికృష్ణ పుట్టపాక
* క్రీడల ఇంచార్జి: సర్దార్ అలి మహమ్మద్
సలహా మండలి సభ్యులుగా.. అరుణ రాయప్రోలు, సుమలత బీరవెల్లి భవాని వెలిగేటి నియమించారు.
Also read:Viral Video: ఈ రెస్టారెంట్ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!
తెలంగాణ జాగృతి – జింబాబ్వేలో ఏర్పాటు చేసిన కమిటీ
* అధ్యక్షులు: మహేందర్ రెడ్డి బెమ్మాడి
* ఉపాధ్యక్షులు: మద్దెల శ్రవణ్ కుమార్ గౌడ్
* ప్రధాన కార్యదర్శి: జక్కా వెంకట్ రెడ్డి
* సంయుక్త కార్యదర్శి: గుర్రం దామోదర్ రెడ్డి
* ట్రెజరర్: తిరుపతి రెడ్డి
* సాంస్కృతిక కార్యక్రమాల ఇంచార్జి: శేఖర్ ముడుపు
* యూత్ ఇంచార్జి: హరివర్దన్
* క్రీడల ఇంచార్జి: శివకుమార్ గౌడ్
* మీడియా ఇంచార్జి: పైల్ల వెంకట్ రెడ్డి
సలహా మండలి సభ్యులుగా కొండల్ రెడ్డి కొవ్వాడపు, దినేష్‌లను నియమించారు
Also read:Heavy rains: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ జాగృతి – నార్వే శాఖ
అధ్యక్షులుగా శ్రీ ప్రసాద్ రావు బిక్కినేని ని ప్రకటించారు. త్వరలోనే ఈ దేశాల పూర్తిస్థాయి కార్యవర్గాలను ప్రకటించనున్నారని ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి రంగు నవీన్ ఆచారి తెలిపారు.
ఈ నియామకాల వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటంటే విదేశాల్లోని తెలంగాణ వాసులను ఒక చోట చేర్చి, వారి సమస్యలు, అభిరుచులు, అభివృద్ధి కోసం జాగృతి ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది. జాగృతి ఇప్పటికే 14 దేశాల్లో ఉంది, ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ విధమైన నియామకాలతో ప్రతి విభాగం ఒక ప్రత్యేక దిశలో పనిచేస్తుంది. స్థానికంగా ఉన్న తెలంగాణ వాసుల సమస్యలు, వారి ఆశలు, యువతకు మంచి అవకాశాలు ఎలా అందించాలి అన్న ప్రశ్నకు జాగృతి సమాధానం ఇస్తోంది.
Also read:Satya Raj : బాహుబలిలో ప్రభాస్ నా తలపై కాలు పెట్టడం అంటే… మూవీనే రిజక్ట్ చేశా
వారిలో ఉన్న సంస్కృతి సంబంధ అనుబంధాలు తగ్గిపోకుండా ఉంచడం కూడా జాగృతిలో ఒక భాగమే అని తెలుస్తుంది. ఈ కొత్త శాఖలు తమకు అవసరమైన నిబంధనలు, కార్యాచరణా పథకాలు త్వరలోనే ప్రకటిస్తాయి. భౌతికంగా ఎవరి వద్ద ఎటువంటి బాధ్యతలు వచ్చాయో, ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో తదుపరి ప్రకటనలలో ప్రకటించనున్నారు. జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకాలతో సంస్థకు మరింత వ్యాప్తి చెందేవిధంగా నూతన దిశను ఇస్తామని తెలిపారు.