Phone charging safety tips:ఈ రోజుల్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం ఎంత కామనూ.. దాని బ్యాటరీ ఎప్పుడు అయి పోతుందో అనే టెన్షన్ కూడా అంతే కామన్. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు సడన్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే పరిస్థితి వస్తే.. పక్కన ఉన్న ఎవరిదో ఒకరి చార్జర్ అడిగి మన ఫోన్‌కు పెట్టేస్తుంటాం. కరెంట్ వస్తే చాలు, ఏ చార్జర్ అయినా సరే అని మనం పెద్దగా పట్టించుకోము. కానీ.. టెక్ నిపుణులు మాత్రం ఇలా ఇతరుల చార్జర్‌ను పదే పదే వాడటం మీ ఫోన్‌కు, ముఖ్యంగా బ్యాటరీకి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అసలు ఇందులో నిజం ఎంత? వేరే చార్జర్లు వాడితే ఏమవుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్లో రూ.10,000 బడ్జెట్ ఫోన్ల నుంచి రూ.1,00,000 పైచిలుకు విలువైన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఫోన్‌కు.. కంపెనీ అందించే ఒరిజినల్ చార్జర్ ఆ పర్టిక్యులర్ మోడల్ కెపాసిటీని బట్టి డిజైన్ చేయబడి ఉంటుంది. ఉదాహరణకు.. మీ ఫోన్ 33W లేదా 67W లేదా 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుండొచ్చు.మీరు అంతకంటే.. తక్కువ వాటేజ్ ఉన్న వేరే చార్జర్ పెడితే ఫోన్ చాలా నెమ్మదిగా చార్జ్ అవుతుంది. ఒకవేళ లోకల్ లేదా క్వాలిటీ లేని చార్జర్‌లను వాడితే మాత్రం ఓవర్ హీటింగ్ సమస్య ఏర్పడి బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోతుంది.
స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేకమైన చిప్స్, ఫాస్ట్ చార్జింగ్ ప్రోటోకాల్స్ ఉంటున్నాయి. మీరు మీ బ్రాండ్ కాకుండా వేరే కంపెనీకి చెందిన హై-పవర్ చార్జర్ లేదా లోకల్ చార్జర్ వాడినప్పుడు.. ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ మీ ఫోన్ మదర్ బోర్డుపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల ఫోన్ త్వరగా వేడెక్కడం , బ్యాటరీ ఉబ్బిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
ఒకవేళ ఎమర్జెన్సీ సమయంలో.. వేరే వాళ్ల చార్జర్ తో ఒకట్రెండు సార్లు చార్జ్ చేయడం వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే నేటి స్మార్ట్ ఫోన్లలో ఉండే.. పీఎంఐసీ కరెంట్ సరఫరాను కొంత వరకు నియంత్రిస్తుంది. కానీ.. ఇది అలవాటుగా మారితే.. మాత్రం మీ ఫోన్ పని తీరు దెబ్బతింటుంది. ఒకవేళ.. మీ ఒరిజినల్ చార్జర్ పాడైపోతే, మార్కెట్లో దొరికే లోకల్ చార్జర్‌లను కొనకుండా, అదే కంపెనీకి చెందిన లేదా సర్టిఫైడ్ ఒరిజినల్ చార్జర్‌ను కొనడం బెస్ట్. మంచి క్వాలిటీ ఉన్న ఒరిజినల్ చార్జర్ ధరలు సాధారణంగా.. రూ. 500 నుంచి రూ.2,000 వరకు ఉంటాయి.
Also Read: పాత గాడ్జెట్ బాక్సులు ఇంట్లో ఉన్నాయా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్టే!
1.ఎప్పుడూ మీ ఫోన్‌తో పాటు.. వచ్చిన ఒరిజినల్ అడాప్టర్ , కేబుల్‌ను మాత్రమే వాడండి.
2.రోడ్డు మీద లభించే చౌకైన లోకల్ చార్జర్‌లను, కేబుల్స్‌ను కొనకండి.
3.ఫోన్ చార్జింగ్‌లో.. ఉన్నప్పుడు గేమ్స్ ఆడటం లేదా హెవీ యాప్స్ వాడటం వల్ల కూడా బ్యాటరీ తొందగా దెబ్బతింటుంది.
చివరిగా చెప్పాలంటే.. ఎమర్జెన్సీలో ఎవరిదైనా చార్జర్ వాడటంలో తప్పు లేదు కానీ.. రెగ్యులర్‌గా ఇతరుల చార్జర్‌లను వాడటం మాత్రం అంత మంచిది కాదు. కాబట్టి మీ ఫోన్ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది!