E-Paper
Advertisement

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: చమురు వెలికి తీసిన తర్వాత ఒక్కసారిగా కోటీశ్వరులైన ఓ స్థానిక సముదాయం. డబ్బు వచ్చి పడ్డాక వాళ్లపై కన్నేసే బయటి వాళ్లు. ఇక ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా చనిపోవడం మొదలవుతుంది. మొదట ఇవన్నీ సహజ మరణాల్లా కనిపించినా, వెనుక భారీ ఆస్తి కోసం వేసిన కుట్ర ఉందని క్రమంగా బయట పడుతుంది. ఓ కుటుంబం సంపదను కొల్లగొట్టేందుకు ప్రేమ, పెళ్లి, నమ్మకం అన్నింటినీ ఆయుధాలుగా మార్చుకున్న మనుషుల కథే ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ (Killers of the Flower Moon). మరి ఈ ఇంగ్షీషు క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

1920లలో ఓక్లహోమాలోని ఓసేజ్ నేషన్ భూముల్లో చమురు బయట పడటంతో అక్కడి ప్రజలు అమెరికాలో అత్యంత సంపన్న సముదాయాల్లో ఒకటిగా మారతారు. కానీ ఆ సంపదే వాళ్లకు ప్రమాదంగా మారుతుంది. ఓసేజ్ ప్రజలకు చెందిన ఆయిల్ హక్కులను దక్కించుకోవడానికి బయటి వాళ్లు వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఎర్నెస్ట్ బర్ఖార్ట్ యుద్ధం తర్వాత ఓక్లహోమాకు తిరిగి వచ్చి తన మామ విలియం హేల్ వద్ద పని చేస్తాడు. హేల్ బయటకు ఓసేజ్ ప్రజలకు స్నేహితుడిలా కనిపిస్తాడు. కానీ అతని అసలు టార్గెట్ వాళ్ల సంపదపై కన్నేయడమే.

Advertisement

ఎర్నెస్ట్, ఓసేజ్ మహిళ మోలీ కైల్ ను కలుస్తాడు. ఆమె కుటుంబానికి విలువైన ఆయిల్ హక్కులు ఉంటాయి. ఇద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్తుంది. ఎర్నెస్ట్ మోలీని పెళ్లి చేసుకోవడం వెనుక ప్రేమతో పాటు ఆమె కుటుంబ సంపదపై హేల్ వేసిన లెక్కలు కూడా ఉంటాయి. మోలీ కుటుంబంలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటాయి. ఆమె సోదరి మిన్నీ అనారోగ్యంతో చనిపోతుంది. తర్వాత మరో సోదరి అన్నా హత్యకు గురవుతుంది. ప్రతి మరణం తర్వాత ఆస్తి హక్కులు మరో కుటుంబ సభ్యుడికి చేరుతాయి. దీంతో మోలీ కుటుంబాన్ని ఒక్కొక్కరిని తొలగిస్తూ సంపదను తమ చేతుల్లోకి తీసుకోవాలనే కుట్ర మరింత స్పష్టమవుతుంది.

స్థానిక పోలీసులు, న్యాయ వ్యవస్థలో హేల్‌ కు ఉన్న ప్రభావం కారణంగా ఈ మరణాలపై సరైన దర్యాప్తు జరగదు. మోలీకి కూడా అనారోగ్యం పెరుగుతుంది. ఆమెకు ఇన్సులిన్ ద్వారా విషం ఇస్తున్నారని తర్వాత తెలుస్తుంది. చివరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి టామ్ వైట్ దర్యాప్తుకు వస్తాడు. ఒక్కో హత్య వెనుక ఉన్న లింక్‌ ను బయటకు తీస్తూ ఎర్నెస్ట్, హేల్ వరకు చేరుకుంటాడు. టామ్ చివరకు నిజాన్ని బయట పెట్టాడా ? ఎర్నెస్ట్ కుట్ర ఎలా బయట పడింది ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్ ?

Advertisement

లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio), రాబర్ట్ డి నీరో (Robert De Niro), లిల్లీ గ్లాడ్‌స్టోన్ (Lily Gladstone), జెస్సీ ప్లెమన్స్ (Jesse Plemons) ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ సినిమాకు మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorsese) దర్శకత్వం వహించారు. Apple TVలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు కానీ తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

చనిపోతూ ఫ్రెండ్ ఇచ్చే భారీ కుక్క… వదిలించుకోడానికి నానాతంటాలు… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు

చేతిలో చిన్న పడవ… ముందేమో అంతులేని సముద్రం… ఓటీటీలోకి తెలుగులో అదిరిపోయే అడ్వెంచర్ సిరీస్

టాక్సిక్ ఓటీటీలో బిగ్ ట్విస్ట్?

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

Big Stories

Advertisement
×