E-Paper
Advertisement

జేబులో రూ.500.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తి.. రవికిషన్ జర్నీ మామూలుగా లేదుగా!

జేబులో రూ.500.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తి.. రవికిషన్ జర్నీ మామూలుగా లేదుగా!
Advertisement

Ravi Kishan: సినీ ఇండస్ట్రీ..ఇది ఒక మాయా ప్రపంచం.ఇక్కడ కోట్లు వెనకేసిన వాళ్ళు ఉన్నారు.కట్టుబట్టలతో దివాలా తీసిన వాళ్ళూ ఉన్నారు.ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పడం కష్టం.అందుకే ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి వెనకాముందు ఆలోచిస్తుంటారు.

అలాంటి ఈ ఫీల్డ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇక్కడ తనని తాను ప్రూవ్ చేసుకోవాలని కేవలం 500 రూపాయలతో ముంబైలో అడుగు పెట్టి నేడు 20 కోట్ల రూపాయల ఆస్తులని కూడా బెట్టి ఎందరికో మార్గదర్శకుడు అయ్యాడు ,అతనే రేసు గుర్రంలో శివా రెడ్డిగా మనందరిని అలరించిన రవి కిషన్.

రూ.500తో మొదలైన రవి కిషన్ జర్నీ

Advertisement

మరింతకీ రవి కిషన్ జర్నీ ఏంటో .అసలు ఎలా సినీ జీవితాన్ని మొదలెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడో చూద్దాం.రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శ్యాంనారాయణ్ శుక్లా . మహారాష్టలోని బొంబాయిలో 1969 జూలై17న జన్మించారు.ఇక సినీ రంగంలోకి 1990లో ఎంట్రీ ఇచ్చారు.

మొదటగా ‘పితాంబర్’తో వెండి తెరపైన కనిపించిన రవి కిషన్ ఆ తర్వాత ‘జఖ్మీ దిల్’, ‘ఆతంక్’, ‘కోయీ కిసీసే కమ్ నహీన్’, ‘కీమత్: దే ఆర్ బ్యాక్’ వంటి సినిమాల్లో నటింఛి ఇండస్ట్రీలో తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ముఖ్యంగా ‘హేరా ఫేరీ’, ‘ఫిర్ హేరా ఫేరీ’ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మరింత క్రేజ్ కొట్టేశారు.ఇక ‘తేరే నామ్’, ‘ఆన్: మెన్ ఎట్ వర్క్’, ‘వెల్ డన్ అబ్బా’ వంటి సినిమాలు జీవితంలో వెనుతిరిగి చూసుకోకుండా చేశాయి.

వెరైటీ రోల్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు

ఇక ‘రావణ్’, ‘తను వెడ్స్ మను’, ‘ఏజెంట్ వినోద్’, ‘బుల్లెట్ రాజా’, ‘లక్నో సెంట్రల్’మర్జావాన్’ వంటి సినిమాల్లో వెరైటీ రోల్స్ తో మెప్పించిన రవి కిషన్ ‘ముక్కాబాజ్’లో చేసిన పాత్రతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యాడు.

భోజ్‌పురి సినిమాతో స్టార్ ఇమేజ్

అయితే రవికిషన్‌కు అసలైన స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది భోజ్‌పురి సినిమా అనే చెప్పాలి.ఒకదశలో రవి కిషన్ భోజ్‌పురి ఇండస్ట్రీతో ఎలా మమేకం అయ్యాడంటే అతడు బీహార్ లో ఏమైనా పుట్టాడా అని అభిమానులు అనుకునేంతగా వరుస సినిమాల్ని చేసుకుపోయాడు.

అలా బోజ్ వుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న రవి కిషన్ ఇటు బాలీవుడ్ లోనూ క్యారెక్టర్ రోల్స్, విలన్ షేడ్స్, సీరియస్ రోల్స్ లో నటించి తన సత్తాని చాటాడు.

తెలుగులో ‘రేసుగుర్రం’తో మాస్ ఇమేజ్

ఇక తెలుగులో‘రేసుగుర్రం’ సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో బన్నీ కి ఎంత పేరు వచ్చిందో,శివారెడ్డి కూడా అంతే పేరు తెచ్చుకోవడం విశేషం.ఇక ఆ తర్వాత ఒక్క అమ్మాయి తప్ప’, ‘ఎంఎల్ఏ’, ‘సాక్ష్యం’,సైరా నరసింహారెడ్డి , ‘హీరో’ వంటి తెలుగు సినిమాల్లోనూ కనిపించాడు కూడా.

‘లాపతా లేడీస్’తో మరోసారి ప్రశంసలు

ఇక ఈ మధ్య వచ్చిన ‘లాపతా లేడీస్’ లో కథని మలుపు తిప్పే పోలీస్ ఆఫీసర్ మనోహర్ పాత్రలో ఆయన చూపించిన నటనకి మంచి ప్రశంసలే దక్కాయి.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి..

అయితే సినిమాలలో సత్తా చాటిన రవి కిషన్ ప్రస్తుతం బీజేపీ తరపున గోరక్ పూర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.మొత్తానికి అటు సినిమాలని, ఇటు రాజకీయాలని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

రూ.20 కోట్ల ఇంటితో మరోసారి హైలెట్

ఇవన్నీ ఇలా ఉండగా ప్రస్తుతం రవి కిషన్ మరోసారి మీడియాలో హైలెట్ అయ్యాడు. ఎందుకు అంటారా ..?ముంబైలోని గోరేగావ్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన డబుల్-డూప్లెక్స్ ఇల్లు ఉందని, దాని విలువ ఏకంగా రూ.20 కోట్ల పైనే ఉంటుందని ఇపుడు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.ఇక ఈ ఇంటికి డబుల్ హైట్ టెర్రస్, జిమ్, విశాలమైన ఇంటీరియర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని బీ టౌన్ లో గట్టిగానే వినిపిస్తుంది.

also read :చిరంజీవినే లెక్క చేయని జానీ మాస్టర్..ప్రమాణ స్వీకారానికి వాళ్లంతా దూరం!

ఎంతో మందికి ఆదర్శంగా రవి కిషన్

ఏది ఏమైనా కేవలం రూ.500లతో జీవితాన్ని మొదలెట్టి ఈ రోజు ఎన్నో విజయాలని సాధించిన రవి కిషన్ ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి

Tags

Related News

ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

‘రంభ ఊర్వశీ మేనక’ టీజర్ రిలీజ్.. ముగ్గు గీస్తే దిగొస్తారా ?

హీరోయిన్ రాధికకి కూడా తప్పని డబ్బా తిప్పలు.. నిరూపించుకున్నారు మేడం!

చిరంజీవినే లెక్క చేయని జానీ మాస్టర్..ప్రమాణ స్వీకారానికి వాళ్లంతా దూరం!

కోతి తెచ్చిన తంటా.. చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్?

ధనుష్ నోరు విప్పలేదు.. ఫ్యాన్స్ మాత్రం పని మొదలుపెట్టేశారు!

వారణాసిలో రామ్ చరణ్.. ఏ పాత్రలో అంటే?

Big Stories

Advertisement
×