E-Paper
Advertisement

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!
Advertisement

OPPO Find X10 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో ప్రీమియం ఫోన్ సిరీస్ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (OPPO) నుంచి కొత్త ఫైండ్ ఎక్స్10 (Find X10) సిరీస్‌ను అక్టోబర్ 21న స్పెయిన్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నట్లు సమాచారం. అదిరిపోయే డిజైన్, హైఎండ్ కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ సిరీస్ టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఫోన్ ధర, పూర్తి ఫీచర్లు, భారత్‌లో విడుదల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రీమియం లుక్‌తో ఆకట్టుకునే డిజైన్..

OPPO Find X10 సిరీస్‌లో డిజైన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. వెనుకవైపు ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు, ఫోన్ బాడీకి చక్కగా కలిసిపోయేలా కెమెరా మాడ్యూల్‌ను రూపొందించారు. ముఖ్యంగా ప్రో మ్యాక్స్ మోడల్‌లో రెండు రంగుల కలయిక, ఆరెంజ్ రింగ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్టైలిష్ లుక్‌తో పాటు చేతిలో పట్టుకున్నప్పుడు లగ్జరీ ఫోన్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఓపో ఈ డిజైన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisement

Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

200MP కెమెరాలతో కొత్త అనుభూతి..

ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఇష్టపడేవారిని ఆకట్టుకునేలా ఈ సిరీస్‌లో కెమెరా ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో లూమో ట్రూ ఇమేజ్ ఇంజిన్‌తో పాటు హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. OPPO Find X10లో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలు, ప్రో మ్యాక్స్ మోడల్‌లో ట్రిపుల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కెమెరా వివరాలను కంపెనీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

2nm ప్రాసెసర్‌తో ఫాస్ట్ పెర్ఫార్మెన్స్..

Advertisement

పనితీరు విషయంలోనూ OPPO Find X10 సిరీస్ కీలకంగా మారనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్‌కు చెందిన శక్తివంతమైన ప్రాసెసర్లు ఉండనున్నట్లు సమాచారం. ప్రో మ్యాక్స్ మోడల్‌లో 2nm చిప్‌సెట్ ఉంటే, గేమింగ్, మల్టీటాస్కింగ్, భారీ యాప్స్ వినియోగం మరింత స్మూత్‌గా ఉండవచ్చు. అయితే ప్రాసెసర్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్..

ఈ ఫోన్ సిరీస్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ భారీ బ్యాటరీ. 8000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అందుబాటులోకి వస్తే, సాధారణ వినియోగంలో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం తగ్గవచ్చు. అలాగే కలర్‌ఓఎస్ 17తో ఫోన్ పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం, సాఫ్ట్‌వేర్ వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా, కెమెరా, డిజైన్, బ్యాటరీ విషయంలో ఆసక్తికరమైన అప్‌గ్రేడ్స్‌తో OPPO Find X10 సిరీస్ వార్తల్లో నిలుస్తోంది. అక్టోబర్ 21న జరిగే ఈవెంట్‌లో ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు, భారత మార్కెట్‌లో లాంచ్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read: రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

Tags

Related News

దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!

కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!

రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్

iPhone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?

Big Stories

Advertisement
×