Panchayat Funds: ఇప్పటి వరకు ఎన్నికలు జరగని ఆ 58 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగని గ్రామపంచాయతీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. అయితే ఎన్నికలు జరగలేదన్న కారణంతో ఈ గ్రామపంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి.
దీంతో ఆ గ్రామపంచాయతీలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర నిధులు విడుదల చేసింది. దీంతో ఆ గ్రామపంచాయతీలకు నిధులు అందనున్నాయి. దాదాపుగా ఇప్పటికి ఏన్నిలకు జరగని 58 గ్రామపంచాయతీలకు 33.62 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
Also read: మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్
ఈ నిధులంన్నింటిని ప్రభుత్వం ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరగలేదని గ్రామాల అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికారుల తెలిపారు. కేంద్ర నిధులు రాకపోయినా.. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోండంలో తెలంగాణ ప్రభుత్వం ముందుటుందని మంత్రి సీతక్క తెలిపారు.
Also read: హరీష్ రావు ఇలాకాలో దారుణం.. గ్రామంలో నివాసమున్నా మాదిగల అడ్రస్ మాయం!