Sircilla Land: ధరణి పోర్టల్ సాయంతో గత ప్రభుత్వంలో సిరిసిల్లలోని 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కొందరి పేర్లకు బదలాయించారని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ఆయన కామెంట్స్ తో మొదలైన ఈ భూ వివాదం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. సిరిసిల్లలో ఆక్రమణలకు గురైన 2 వేల ఎకరాలకు పైగా భూములను 22ఏ నుంచి తొలగించామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మరో 8 వేల ఎకరాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బీఆర్‌ఎస్ గట్టిగా కౌంటర్
ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. 8 వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి.. ఏ గ్రామాల్లో ఉన్నాయి.. ఏ సర్వే నంబర్లలో ఉన్నాయి.. ఎవరి పేర్లకు బదిలీ అయ్యాయి? వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు కాదు.. వివరాలను చెప్పాలని కోరుతూ సమాచారం చట్టం అధికారికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం చెబుతున్న భూ వివరాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలు కొత్త వెర్షన్
ఈ వివాదంలో బీఆర్ఎస్ నేతలు కొత్త వెర్షన్ తీసుకొస్తున్నారు. గతంలో ప్రభుత్వం పేదలకిచ్చిన భూములు, రెగ్యులరైజేషన్ చేసి పట్టాలు ఇచ్చిన భూములను కూడా కాంగ్రెస్.. గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలు, ఆరోపణలు, అనుమానాలకు క్లారిటీ రావాలంటే పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డులు, పాత పట్టాలు, ధరణి నమోదులు పరిశీలించాలి. ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాలు.. ఆరోపణలు, కౌంటర్లకే పరిమితం అయ్యాయి. కానీ, కంప్లీట్ సర్వే చేస్తే నిజాలు తేలుతాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్వే చేసి కబ్జా భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు.
Also Read: జ్ఞానేష్ గేట్ నిజంగానే స్కామా? 13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక అసలేం జరిగింది?