Sampoornesh Babu:సంపూర్ణేష్ బాబు..హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ కమెడీయన్ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఆతర్వాత వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కూడా సంపూకి మంచి ఫాలోయింగ్ నే తెచ్చిపెట్టింది. ఇక ఆతర్వాత చాలా సినిమా చేసినప్పటికీ మళ్ళీ స్థాయిలో సత్తా చూపలేకపోయాడు.ఇదిగో సరిగ్గా ఈ సమయంలోనే మళ్ళీ ప్యారడైజ్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని పలకరించాడు.
బిర్యాని పాత్ర పోషించిన సంపూర్ణేష్ బాబు
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.అయినప్పటికీ రెండురోజుల్లోనే సినిమా ఏకంగా 114 కోట్లు వెనకేయడం విశేషం.
అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ సినిమా కి సంబంధించిన తమ అనుభవాలని పంచుకున్నారు.ఈ క్రమంలో సినిమాలో బిర్యాని పాత్ర పోషించిన సంపూర్ణేష్ బాబు నాని గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎలా చెప్పాలో నాని స్వయంగా
సంపూ మాట్లాడుతూ ‘ది ప్యారడైజ్’లో తను చేసిన పాత్ర చాలా సంతృప్తిని ఇచ్చిందని,నాని పక్కన ఉండి నటించడం తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ‘మాలిక్ ఎక్కడ?’ అనే డైలాగ్‌ను ఎలా చెప్పాలో నాని స్వయంగా నేర్పించారని , నాని ఆ డైలాగ్‌ను చాలా సహజంగా, చిన్నగా చెప్పడంతో తాను కూడా నాని లాగే చెప్పేందుకు ప్రయత్నించానని అసలు విషయం తెలిపాడు.మాములుగా ఒక స్టార్ హీరో తనతో కలిసి నటించే ఆర్టిస్ట్‌కు డైలాగ్ డెలివరీ విషయంలో సలహాలు ఇవ్వడం మనకి తెల్సిందే. అయినప్పటికీ.. నాని తనకు స్వయంగా నేర్పించాడని సంపూర్ణేష్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మళ్లీ ఈరోజు ‘ది ప్యారడైజ్’కి మోగింది
అయితే ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు కాస్త ఎమోషనల్ అవుతూ. ‘కొబ్బరి మట్ట’ సినిమా తర్వాత తన ఫోన్ దాదాపుగా మోగడం ఆగిపోయిందని ,సినిమా అవకాశాల కోసం ఫోన్ కాల్స్ రావడం తగ్గిపోయిందని, మధ్యలో ఒక్కసారి కూడా తన ఫోన్ మోగలేదని వాపోయాడు. “కొబ్బరి మట్ట రిలీజ్ తర్వాత ఆగిపోయిన నా ఫోన్.. మళ్లీ ఈరోజు ‘ది ప్యారడైజ్’కి మోగింది అన్నా. మధ్యలో ఒక్కసారి కూడా మోగలేదు” అంటూ సంపూర్ణేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ హైప్ మోయలేక చతికిల పడుతుందా !
ప్యారడైజ్ సినిమాకి వస్తే .. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాబట్టకపోవడంతో డీలా పడుతున్నారు నాని ఫ్యాన్స్. చూడాలి మరి మరో రెండు రోజులు గడిస్తే సినిమా ఏమైనా సాలిడ్ గా ల్యాండ్ అవుతుందా లేక భారీ హైప్ మోయలేక చతికిల పడుతుందా !
also read :ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!