Sapthagiri Theatre:ఆర్టీసీ క్రాస్‌రోడ్స్..ఈ ప్రాంతానికి ఎంత ప్రత్యేకత ఉందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మూవీ లవర్స్ కి ఇదొక అడ్డా అనే చెప్పాలి .అటు తిరిగితే ఉషామయూరి, ఇటు తిరిగితే ఓడియన్ ముందుకెళ్తే సుదర్శన్ ఇలా చౌరస్తా లో ఎటు వెళ్ళినా థియేటర్ లలతో ఆ ప్రాంతం అంతా కల కలలాడేది.
కాని కరోనా పుణ్యమా అని , అరచేతిలోకే సినిమా వచ్చేయడంతో ఆడియన్స్ థియేటర్ ల మొహాలే చూడని పరిస్థితి దాపురించడంతో సినిమా హళ్ళు కాస్తా ఫంక్షన్ హాళ్ళుగా మారుతున్న పరిస్థితి.కారణం ఏ థియేటర్ ఓనర్ అయినా స్టార్ హీరో సినిమా తమ థియేటర్ లో పడాలని, ఆడియన్స్ ఇబ్బడి ముబ్బడిగా రావాలని కోరుకుంటారు కాని ఇప్పుడా పరిస్థితి లేకపోవడమే .
ఎక్కువ క్రౌడ్ వస్తే టెన్షన్
కాని ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ సిటీలో దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విడుదలైందని నాని చెప్పగా.. ఒక్క సప్తగిరి 70MMలో మాత్రం సినిమా రిలీజ్ కాలేదని శశి చెప్పుకొచ్చాడు. దానికి కారణం ఆ థియేటర్ ఓనర్‌కు ఎక్కువ క్రౌడ్ వస్తే టెన్షన్‌గా ఉంటుందని, అందుకే కొత్త సినిమాలను అక్కడ స్క్రీనింగ్ చేయడానికి అతడు ఇష్టపడడు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇపుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ఎవరైనా థియేటర్ రన్ చేస్తే జనాలు ఇబ్బడి ముబ్బడిగా రావాలని ,గల్లా పెట్టెలు గల గల లాడాలని,ఆడిటోరియం కల కల లాడాలని కోరుకుంటారు కాని అసలు జనాలు వస్తే ఈ టెన్షన్ రావడ మేంట్రా అంటూ థియేటర్ గురించి ఆరాలు తీసే పనిలో పడ్డారంతా !
అంచనాలు లేని సినిమాలు
మాములుగా ఒకప్పుడు పెద్ద సినిమాలు, భారీ కటౌట్లు, హౌస్‌ఫుల్ బోర్డులు, టికెట్ల కోసం క్యూలు కనిపించే ఈ ఏరియాలో ఇప్పుడు సప్తగిరి థియేటర్ ఇలా వాటికి దూరంగా, చిన్న చిన్న ,అంచనాలు పెద్దగా లేని సినిమాలు వేసుకుంటూ ,ఇంకా థియేటర్ ని రన్ చేస్తున్నాడంటే ఆశ్చర్యమే.అయితే చిన్న సినిమాలకి పెద్దగా థియేటర్లు దొరకవు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే పనిలో భాగంగానే చిన్న సినిమాలకి థియేటర్ ని రెంట్ కి ఇస్తూ డబ్బులు గడిస్తున్నాడన్న టాక్ కూడా ఉంది.
డెవలప్ చేసే అవకాశం ఉన్నప్పటికీ
పెద్ద సినిమాలకి ఎలాగూ ఫుల్ పబ్లిక్ వెళ్తారు.కాని చిన్న సినిమాలు ఆడే థియేటర్లకి ఎవరూ వెళ్ళరు.దీన్ని ఆసరాగా చేసుకునే చిన్న చిన్న సినిమాలు ,ఎక్కువగా గుర్తింపు లేని సినిమాలు ,బజ్ తక్కువ ఉన్న సినిమాలు వేస్తాడని తెలుస్తుంది.ఇక దీంతో ప్రేమపక్షులు, కాస్త ప్రశాంతంగా సమయం గడిపే వారు, బయట కాలక్షేపం కానివారు..ఇలా ఈ సప్తగిరి థియేటర్ ని ఆశ్రయిస్తాయరనే టాక్ కూడా ఉంది.
అందుకే ప్రస్తుతం మిగతా ఏరియాల్లో జరిగినట్టుగా ఈ థియేటర్‌ను కూడా పూర్తిగా డెవలప్ చేసి కొత్త సౌండ్ సిస్టమ్, మంచి క్వాలిటీ ఉన్న మెరుగైన స్క్రీన్, కంఫర్టబుల్ గా ఉండే సీటింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ ఆప్షన్స్‌తో రీడెవలప్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాటికి దూరంగా నామ మాత్రపు షోలతో నే ఈ థియేటర్ రన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
also read :జిమ్‌లో మంచు విష్ణు కష్టాలు చూస్తే.. ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది!
సప్తగిరి 70MM ఓనర్ ఏమంటాడో
ఏది ఏమైనా మరి నిజంగానే ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తే టెన్షన్ వస్తుందా లేక థియేటర్‌ను నడిపించే విషయంలో ఇంకేమైనా బిజినెస్ స్ట్రాటజీలు ఉన్నాయా అన్నది సప్తగిరి 70MM ఓనర్ చెబితే కాని తెలిసేలా లేదు !