Cryonics Case: మరణం మనిషి జీవితానికి చివరి అధ్యాయం అంటాం. కానీ భవిష్యత్ వైద్యంపై నమ్మకంతో ఆ మరణానికే సవాల్ విసిరే ప్రయత్నం ఇప్పుడు ముంబైలో చర్చకు దారితీసింది. ముంబై మలాడ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నాలుగేళ్ల క్రితం మృతి చెందిన 80 ఏళ్ల వృద్ధుడి మృతదేహం ఓ మెడికల్ క్లినిక్‌లో భద్రపరిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ Informer Alertతో రంగంలోకి దిగిన పోలీసులు క్లినిక్‌కు చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. భవిష్యత్‌లో వైద్యశాస్త్రం మరింత అభివృద్ధి చెంది. తిరిగి జీవించే అవకాశం వస్తుందనే ఆశతో మృతదేహాన్ని భద్రపరచాలని క్లినిక్‌ను కోరినట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఓ Cryonics Facilityకి తరలించే వరకు మృతదేహాన్ని సంరక్షించాలని కుటుంబ సభ్యులు భావించినట్లు పోలీసులు నిర్ధారించారు.
Also read: తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!
మరణం తర్వాత శరీరాన్ని అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో భద్రపరిచి భవిష్యత్‌లో టెక్నాలజీ అభివృద్ధి చెందితే తిరిగి జీవించే అవకాశం ఉంటుందనే ఆలోచనే క్రయోనిక్స్. అయితే ఇది ఇప్పటికీ Experimental Stageలోనే ఉంది. మరణించిన వ్యక్తిని తిరిగి బతికించవచ్చని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Cryopreservation మాత్రం మెడికల్ రంగంలో ఇప్పటికే ఉపయోగంలో ఉంది. కణాలు, టిష్యూలు, ఎంబ్రియోలను భద్రపరిచేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే పూర్తి మానవ శరీరాన్ని భద్రపరచి భవిష్యత్‌లో తిరిగి జీవం పోయడం మాత్రం ఇప్పటికీ సైన్స్ ముందున్న అతిపెద్ద ప్రశ్నగానే ఉంది.
ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే మృతదేహాన్ని క్లినిక్‌లో ఉంచిన విషయాన్ని కుటుంబ సభ్యులు కానీ, క్లినిక్ నిర్వాహకులు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ ఉదంతం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు Legal Opinion తీసుకుంటున్నారు. మృతదేహాన్ని ఇలా భద్రపరచడం చట్టబద్ధమేనా..? ఎంతకాలం వరకు ఉంచవచ్చు? అనే అంశాలపై న్యాయ నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు కోరుతున్నారు. మరణాన్ని జయించాలన్న మనిషి ఆశకు ప్రతిరూపంగా నిలిచే క్రయోనిక్స్ ప్రస్తుతం ఆశలు, అనుమానాల మధ్య ఉన్న ఓ ప్రయోగం. ముంబైలో బయటపడిన ఈ ఘటన Science vs Hope అనే కొత్త చర్చకు తెరతీసింది.
Also read: కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఖాయం.. కేసీఆర్ మళ్లీ సీఎంగా రాబోతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు