E-Paper
Advertisement

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Medical Drama Series: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథలు ఎంత హిట్ అవుతున్నాయో… ఎమోషనల్ డ్రామాలకు కూడా అంతే ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వైద్యుల జీవితంలో కనిపించని ఒత్తిడి, పర్సనల్ లైఫ్ కష్టాలు, పేషెంట్లతో ఏర్పడే అనుబంధాలు.. ఇవన్నీ కలిసినప్పుడే ఒక మంచి మెడికల్ డ్రామా రూపుదిద్దుకుంటుంది. అలాంటి సిరీస్‌లలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్ Heart Beat. ఇప్పటికే రెండు సీజన్లతో మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్ ఇప్పుడు Season 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత సీజన్‌లో మిగిలిన ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయా ? కొత్త సీజన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ స్టోరీ, ఓటీటీ డీటైల్స్ తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆర్కే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్… బయట నుంచి చూస్తే సాధారణ ఆస్పత్రిలా కనిపించినా, లోపల ప్రతి రోజు ఎన్నో భావోద్వేగ కథలు నడుస్తుంటాయి. డాక్టర్ల బాధ్యతలు, పేషెంట్స్ ప్రాణాలతో పోరాడే క్షణాలు, పర్సనల్ లైఫ్ లో ఎదురయ్యే ఒత్తిళ్లు… ఇవన్నీ ఈ కథకు ప్రధాన బలం. ప్రతి పాత్ర తనదైన ప్రయాణంతో ప్రేక్షకుడికి దగ్గరవుతుంది.

Advertisement

గత సీజన్ ముగింపులో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత డాక్టర్ రీనా కోమాలోకి వెళ్లిపోవడం కథను ఊహించని మలుపు తిప్పింది. ఆ సంఘటన తర్వాత ఆస్పత్రిలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఏడాది గ్యాప్ తర్వాత కొత్త యాజమాన్యం బాధ్యతలు చేపడుతుంది. అదే సమయంలో కొత్త డాక్టర్లు హాస్పిటల్‌లో అడుగు పెడతారు. వారి రాకతో పాత బంధాలు, కొత్త విభేదాలు, అనుకోని పరిణామాలు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి.

రీనా పరిస్థితి ఏమైంది ? కొత్త యాజమాన్యం రావడంతో ఆస్పత్రిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? కొత్తగా వచ్చిన డాక్టర్లు కథను ఎలాంటి మలుపు తిప్పారు ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్‌ను చివరి వరకు చూడాల్సిందే.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

తెలుగు ప్రేక్షకులకు మరో శుభవార్త ఏమిటంటే… తమిళ ఒరిజినల్‌గా రూపొందిన ఈ మెడికల్ డ్రామా ఇప్పుడు JioHotstarలో తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది. జులై 30 నుంచి మొదటి నాలుగు ఎపిసోడ్లను ఒకేసారి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు. ఇకపై ప్రతి గురువారం ఒక్కో కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. సాధారణంగా వెబ్‌సిరీస్‌లు 8 లేదా 10 ఎపిసోడ్లతో ముగుస్తాయి. కానీ ‘హార్ట్ బీట్’ మాత్రం ఇప్పటికే రెండు సీజన్లలో దాదాపు 100 ఎపిసోడ్ల వరకు సాగి మంచి ఆదరణ సంపాదించింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ కథలు ఇష్టమైతే ‘హార్ట్ బీట్ సీజన్ 3’ని అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో యాక్షన్ కంటే భావోద్వేగాలకు, పెద్ద ట్విస్టుల కంటే పాత్రల ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్ పూర్తయ్యాక తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలిగించేలా కథను నడిపించారు. ఫ్యామిలీతో కలిసి చూసే మంచి మెడికల్ డ్రామా కోసం చూస్తుంటే ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో పెట్టేయొచ్చు. అయితే ఈ సిరీస్ ను చూసే ముందు… ఒకవేళ ఇప్పటిదాకా సీజన్ 1, 2లను చూడకపోతే హోల్డ్ ఆన్. ఆ రెండు సిరీస్ లను చూసిన తరువాత దీన్ని చూస్తే కథ ఇంకా బాగా అర్థం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Read Also: కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

Tags

Related News

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు.. ఆ 2 మాత్రం మిస్ అవ్వద్దు!

ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

Big Stories

Advertisement
×