E-Paper
Advertisement

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!
Advertisement

Audio Sound Quality: మనం రోజూ వినే పాటల్లో చాలా రకాల ఆడియో ఫార్మాట్లు ఉంటాయి. సాధారణంగా ఫైల్ సైజ్ తక్కువగా ఉండటం కోసం చాలామంది MP3 ఫార్మాట్ వాడతారు. కానీ వీటిలో సౌండ్ క్లారిటీ, డెప్త్ చాలా వరకు తగ్గిపోతాయి. అదే ఫ్లాక్ వంటి ఫార్మాట్లలో పాట వింటే సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. మరి మన దగ్గర ఉన్నది తక్కువ క్వాలిటీ ఆడియో ఫైల్ అయినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో తక్కువ రిజల్యూషన్ ఉన్న పాటలు వింటున్నప్పుడు వాటి సౌండ్ పెంచుకోవడం ఎలాగని ఆలోచిస్తున్నారా? లోపించిన ఆడియో డేటాను మనం కొత్తగా సృష్టించలేం కానీ, కొన్ని మార్పులతో ఆ పాటల క్వాలిటీని మెరుగుపరచవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

మంచి డ్యాక్ వాడటం..

మన ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఉండే డిజిటల్ డేటాను స్పీకర్లు అర్థం చేసుకునేలా మార్చే ప్రక్రియను డ్యాక్ (DAC) చేస్తుంది. ప్రతీ ఫోన్‌లో ఇది ఉన్నప్పటికీ.. అంతర్గత విడిభాగాల వల్ల కొన్నిసార్లు నాయిస్ వస్తుంది. అందుకే ఒక మంచి పోర్టబుల్ డ్యాక్ కొనుగోలు చేసి ఉపయోగిస్తే.. డిజిటల్ సిగ్నల్స్ మెరుగుపడి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ సౌండ్ వస్తుంది.

యాంప్లిఫైయర్ ఉపయోగించడం..

Advertisement

చాలామంది యాంప్లిఫైయర్ కేవలం సౌండ్ పెంచడానికే అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. అది ఆడియో సిగ్నల్ బలాన్ని పెంచి పాటలోని ప్రతీ చిన్న శబ్దాన్ని కూడా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. సరైన పోర్టబుల్ యాంప్ ఉపయోగించడం వల్ల ఫోకస్ లేని తక్కువ ఆడియో ఫైల్స్ కూడా చాలా స్పష్టంగా, వినసొంపుగా మారతాయి.

Also Read: అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

క్వాలిటీ హెడ్‌ఫోన్స్ లేదా స్పీకర్లు..

Advertisement

మనం వాడే హెడ్‌ఫోన్స్ లేదా స్పీకర్లు సరిగ్గా లేకపోతే ఎంత మంచి పాట అయినా సరే బాగోదు. తక్కువ ధర స్పీకర్లలో ఒకే డ్రైవర్ ఉండటం వల్ల బేస్, ట్రైబుల్ సరిగ్గా రావు. కాస్త మంచి బ్రాండ్ హెడ్‌ఫోన్స్ వాడితే.. వేర్వేరు ఫ్రీక్వెన్సీలకు ప్రత్యేక డ్రైవర్లు ఉండి పాటలో ఉన్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా బాగా వినబడుతుంది.

ఈక్యూ సెట్టింగ్స్ మార్చడం..

మన ఇష్టానికి తగ్గట్టు సౌండ్ వినాలంటే ఈక్వలైజర్ (EQ) అద్భుతమైన దారి. స్పీకర్లలో ట్రైబుల్ ఎక్కువైతే తగ్గించుకోవడానికి, బేస్ తక్కువగా ఉంటే పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ లేదా మ్యూజిక్ ప్లేయర్ లోని ఈక్యూ సెట్టింగ్స్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తే.. సాధారణ ఆడియో ఫైల్స్ కూడా మంచి అనుభూతిని ఇస్తాయి.

డీఏడబ్ల్యూ సాఫ్ట్‌వేర్ వాడటం..

ప్లేయర్ లోని ఈక్యూ మార్చితే అది అన్ని పాటలకు వర్తిస్తుంది. కానీ ప్రతీ పాటకీ ఒకే రకం సెట్టింగ్స్ సెట్ కావు. అందుకే డిజిటల్ ఆడియో వర్క్‌స్టేషన్ (DAW) సాఫ్ట్‌వేర్ వాడి పాటల ఈక్యూను శాశ్వతంగా మార్చి సేవ్ చేయవచ్చు. అంతేకాదు.. పాటలో ఉండే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను కూడా దీని ద్వారా సులభంగా తీసేయవచ్చు.

Also Read: జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

Tags

Related News

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!

రూ.3,000 బడ్జెట్‌లో వావ్ అనిపించే ANC ఇయర్‌బడ్స్.. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ నెక్ట్స్ లెవెల్!

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

Big Stories

Advertisement
×