SSMB 29:రాజమౌళి (Rajamouli).. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన ఘనుడు. అటు దర్శకుడిగా విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూనే.. మరొకవైపు అదే చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ‘శాంతినివాసం’ అనే సీరియల్ తో కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాలు చేసి దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఇక తర్వాత ఈగ, యమదొంగ, మగధీర, విక్రమార్కుడు, చత్రపతి ఇలా ప్రతి చిత్రంతో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈయన…బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించారు. మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేశారు.
ఎస్ఎస్ఎంబి 29 సినిమా పై కే కే సెంథిల్ కీలక కామెంట్లు..
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో అడ్వెంచర్ ఆక్షన్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు కొంతమంది నటులు కూడా భాగం అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సడన్ గా ఈ సినిమాపై ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ కేకే సెంథిల్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఎస్ ఎస్ ఎం బి 29 మూవీ కోసం రాజమౌళి అందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అందుకే తనకు అవకాశం ఇవ్వలేదు అంటూ అసలు సమస్యను కవర్ చేసే విధంగా కామెంట్లు చేశారు.
రాజమౌళి కొత్త వాళ్లను తీసుకుంటున్నారంటూ కవరింగ్..
సెంథిల్ మాటల ప్రకారమే చూస్తే.. ఈ సినిమాకి ఒకవేళ రాజమౌళి అందరినీ కొత్త వాళ్ళనే తీసుకునేటట్లయితే కీరవాణితోపాటు పలువురు టెక్నీషియన్స్ ని కూడా ఆయన కచ్చితంగా మార్చి ఉండాలి. అలా జరగలేదు. దీనికి తోడు రాజమౌళి మొదటి సినిమా అనౌన్స్మెంట్ చేసిన దగ్గర్నుంచి ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలకు దాదాపు అందరూ కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు. అటు సెంథిల్ కూడా రాజమౌళి నిర్మించిన బాహుబలి సినిమా వరకు రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా పనిచేశారు కానీ ఆ సినిమా సమయంలోనే కాస్త విభేదాలు వచ్చాయని సమాచారం. అందుకే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం కేకే సెంథిల్ ని సంప్రదించలేదని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ఆయనే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
సెంథిల్ కామెంట్స్ పై నెటిజన్స్ ట్రోల్స్..
ఇప్పుడు తాజాగా సెంథిల్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం లేదు అని స్పష్టం చేశారు. ఇకపోతే గొడవలు ఉన్నాయని విషయం బయటకి వస్తే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఆలోచించిన సెంథిల్.. తాజాగా కవర్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సెంథిల్ మాట్లాడుతూ.. “ఎస్ఎస్ఎమ్బి 29 సినిమా కోసం రాజమౌళి అందరిని కొత్త వాళ్ళనే తీసుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్టులో నేను భాగం కాలేకపోయాను” అంటూ చెప్పడంతో ఇది విన్న నెటిజన్స్ భలే కవర్ చేసుకుంటున్నావు సెంథిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది జక్కన్న కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా? ఇలాంటి కవర్ చేసే మాటలు ఇంకెన్నాళ్లు మాట్లాడతావు? అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికైతే కేకే సెంథిల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Star Heroine: మూడు తరాలను కవర్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?