E-Paper
Advertisement

అప్పు తీర్చేందుకు శవాన్ని కిడ్నాప్ చేశారు… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్

అప్పు తీర్చేందుకు శవాన్ని కిడ్నాప్ చేశారు… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్
Advertisement

Telugu Crime Comedy Movie: ఒక గ్యాంగ్‌స్టర్‌ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి ముగ్గురు స్నేహితులు ఏకంగా ఓ శవాన్నే కిడ్నాప్ చేయాల్సి వస్తే.. అది కూడా ఆ శవం వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉందని వాళ్లకు తెలియకపోతే? ఈ విచిత్రమైన ఆలోచనతో మొదలై, ఊహించని మలుపులు, సిట్యుయేషనల్ కామెడీతో సాగిపోయే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘ఎమ్.ఆర్.పి – నీకెంత నాకెంత?’. ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు సినిమాలో, క్రైమ్‌తో కామెడీని కలిపి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుకోవాలంటే, ముందు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముగ్గురు రూమ్‌మేట్స్ తమ జీవితాలను ఎలాగైనా మార్చుకోవాలని అనుకుంటారు. పెద్దగా డబ్బు లేకపోయినా సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఒక్కసారిగా సెటిల్ అవ్వాలనేది వారి కల. కానీ పెట్టుబడి కోసం డబ్బు అవసరం కావడంతో ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ దగ్గర అప్పు తీసుకుంటారు. వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లు సాగకపోవడంతో ముగ్గురూ అప్పులో చిక్కుకుపోతారు.

Advertisement

ఇక గ్యాంగ్‌స్టర్ ఇచ్చిన గడువు దగ్గర పడటంతో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పు తీర్చకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిక రావడంతో, ముగ్గురూ ఊహించని ఓ ప్లాన్ వేస్తారు. ఒక కోటీశ్వరుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి, దాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అసలు చనిపోయిన వ్యక్తిని ఎలా కిడ్నాప్ చేస్తారు ? అనే ఆలోచనే ఈ కథలోని అసలు విచిత్రం.

అయితే శవాన్ని కిడ్నాప్ చేసిన తర్వాతే వాళ్ల కష్టాలు మరింత పెరుగుతాయి. దాన్ని దాచడం, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవడం, అనుకున్న ప్లాన్‌ను అమలు చేయడం కోసం ముగ్గురూ పడే తిప్పలు నవ్వులు తెప్పిస్తాయి. ఒక సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురవుతూ కథను ముందుకు నడిపిస్తుంది.

Advertisement

ఇంతలో ఆ శవం వెనుక ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. డబ్బు వ్యవహారాల నుంచి నేర ప్రపంచం వరకు కథ ఊహించని దిశలో మలుపులు తిరుగుతుంది. తాము చిన్న సమస్యను పరిష్కరించుకోవడానికి వేసిన ప్లాన్‌ చివరకు ఎంత పెద్ద ప్రమాదంలోకి నెట్టిందో ముగ్గురు స్నేహితులకు అర్థమవుతుంది.

ఇక్కడి నుంచి సినిమా అసలు ట్విస్ట్‌లతో ఆసక్తిని పెంచుతుంది. శవాన్ని చుట్టూ పెట్టుకున్న ఈ ముగ్గురి ప్లాన్‌లోకి మరికొందరు వ్యక్తులు రావడం, వాళ్ల ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటపడటం కథను మరింత గందరగోళంగా మారుస్తుంది. ముఖ్యంగా శవాన్ని దాచేందుకు చేసే ప్రయత్నాల్లో వచ్చే సన్నివేశాలు కామెడిగా ఉంటాయి. ఒకవైపు గ్యాంగ్‌స్టర్ ఒత్తిడి.. మరోవైపు తమ ప్లాన్ బయటపడుతుందనే భయం.. ఇంకోవైపు ఊహించని పరిణామాలు.. ఇలా ముగ్గురి పరిస్థితి క్రమంగా మరింత ఇబ్బందికరంగా మారుతుంది. మరి హీరో అండ్ గ్యాంగ్ ఈ పరిస్థితుల నుంచి ఎలా బయట పడ్డారో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ సినిమాలో నరేష్ అగస్త్య, డోనాల్ బిస్త్ ప్రధాన పాత్రల్లో కనిపించగా… వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శ్రవణ్ జెస్టా ఈ సినిమాను సాధారణ క్రైమ్ కథలా కాకుండా, ఓ శవాన్ని పక్కన పెట్టుకుని ముగ్గురు స్నేహితులు చేసే హంగామాను కామెడీగా చూపించారు. క్రైమ్, కామెడీ, ట్విస్టులు కలిసిన కథలను ఇష్టపడేవారికి ‘ఎమ్.ఆర్.పి – నీకెంత నాకెంత?’ మంచి టైమ్‌పాస్ . ప్రస్తుతం Jio Hotstar, (Aha) ఆహాలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ 2 గంటల 22 నిమిషాల సినిమాను వీకెండ్‌లో ఓసారి సరదాగా చూడొచ్చు.

Read Also: ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

Tags

Related News

6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ

అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

భర్త మీద అలిగి నదికిపోతే… 15 నిమిషాలే… కానీ గుండెల్లో దడ పుట్టించే హారర్ షార్ట్ ఫిల్మ్

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×