E-Paper
Advertisement

16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ

16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ
Advertisement

Operation Safed Sagar OTT: కార్గిల్ మంచు కొండల్లో శత్రువుల చొరబాటు… వేల అడుగుల ఎత్తులో యుద్ధ విమానాలతో భారత వాయుసేన ఎదురుదాడి.. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన పైలట్లు.. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్‌ను కళ్లకు కట్టినట్లు చూపించే సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. ఓటీటీ‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ ఆరు ఎపిసోడ్ల వార్ డ్రామా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1999 వేసవిలో కథ షురూ అవుతుంది. పాకిస్తాన్ సైనికులు గుట్టుచప్పుడు కాకుండా కార్గిల్ పర్వత ప్రాంతంలోని భారత సైనిక స్థావరాలను ఆక్రమిస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 13 వేల నుంచి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాల్లో శత్రువులు వ్యూహాత్మకంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి భారత సైనికులపై, కీలక రహదారులపై దాడులు చేయడం మొదలుపెడతారు. అత్యంత ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్ కొరత, ఎత్తైన పర్వతాలు భారత సైన్యానికి సవాలుగా మారతాయి.

Advertisement

ఇలాంటి సమయంలో భారత వైమానిక దళానికి చెందిన గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ రంగంలోకి దిగుతుంది. ఇంత ఎత్తులో యుద్ధ విమానాలను నడపడం, శత్రువుల లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి దాడి చేయడం అంత ఈజీ కాదు. అయినా దేశ భద్రత కోసం పైలట్లు ప్రాణాలను లెక్కచేయకుండా మిషన్‌ను ప్రారంభిస్తారు. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా, టోనీతో పాటు ఇతర పైలట్లు పగలు, రాత్రి తేడా లేకుండా ప్రమాదకరమైన ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తారు. మరి ఈ యుద్ధం ఎలా ముగిసిందో తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

స్ట్రీమింగ్ తెలుగులోనే…

శత్రువుల యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితుల మధ్య ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక దశలో అజయ్ అహూజా విమానం శత్రువుల దాడికి గురవడం కథలో అత్యంత విషాదకరమైన మలుపుగా నిలుస్తుంది. అదే సమయంలో భారత వాయుసేన ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ శత్రువుల బంకర్లను టార్గెట్ చేస్తుంది. లేజర్ గైడెడ్ బాంబుల వినియోగం యుద్ధంలో కీలకమైన మార్పును తీసుకొస్తుంది.

Advertisement

సిరీస్ ప్రత్యేకత విషయానికి వస్తే… ఇది రియల్ స్టోరీ. షూటింగ్‌లో కూడా అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతాలను ఉపయోగించడంతో యుద్ధ వాతావరణం మరింత సహజంగా అనిపిస్తుంది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్ ప్రధాన పాత్రల్లో కనిపించగా, ఓని సేన్ దర్శకత్వం వహించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లుగా సాగే ఈ సిరీస్‌లో ప్రతి భాగం సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుంది. దేశభక్తి, యుద్ధం, సైనికుల త్యాగం, వాయుసేన వ్యూహాలు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. భారీ యాక్షన్ కంటే యుద్ధ సమయంలో ఎదురైన నిజమైన సవాళ్లను, పైలట్ల మానసిక స్థైర్యాన్ని చూపించడం సిరీస్‌లో హైలెట్.

ఈ కథలో కేవలం యుద్ధ విమానాల దాడులు మాత్రమే కాకుండా, ఒక పైలట్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉన్న బాధ్యతను కూడా చూపించారు. వేల అడుగుల ఎత్తులో విమానం నడుపుతూ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంత కష్టమో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అందుకే ఇది కేవలం యాక్షన్ సిరీస్ కాకుండా, దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల కథగా కూడా గుర్తుండిపోతుంది. ఇలాంటి కథలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు ఆడియోతో ఈ సిరీస్‌ను తప్పక చూడొచ్చు.

Read Also: ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

Tags

Related News

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

అప్పు తీర్చేందుకు శవాన్ని కిడ్నాప్ చేశారు… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్

అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

భర్త మీద అలిగి నదికిపోతే… 15 నిమిషాలే… కానీ గుండెల్లో దడ పుట్టించే హారర్ షార్ట్ ఫిల్మ్

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

Big Stories

Advertisement
×