Vivo Y21 5G Price Drop: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రోజూ ఎన్నో ఫోన్లు వస్తుంటాయి కానీ, కొన్ని డీల్స్ చూసినప్పుడు మాత్రం ‘అబ్బా.. ఇది కదా ఆఫర్ అంటే! అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక బంపర్ డీలే ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిస్తోంది. భారీ బ్యాటరీ లైఫ్, స్మూత్ 120Hz స్క్రీన్ ఉన్న Vivo Y21 5G ఫోన్ దాదాపు సగం ధరకే దొరుకుతోంది. రోజు మొత్తం ఫోన్ వాడుతూ.. తరచూ ఛార్జింగ్ పెట్టే ఓపిక లేని వారికి ఈ ఆఫర్ పక్కాగా సెట్ అవుతుంది. అసలు ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర ఎంత తగ్గింది? ఏయే ఆఫర్లు కలిపితే ఎంతకు వస్తుందో ఒకసారి చూసేద్దాం!
ఈ Vivo Y21 5G అసలు ధర రూ.44,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా ఇది కేవలం రూ.19,499కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.25,500 వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే మరో రూ.750 అదనపు డిస్కౌంట్ పొందే వెసులుబాటు ఉంది. అయితే కొనేముందు పేమెంట్ పేజీలో రూల్స్ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
Vivo Y21 5Gలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఇందులో ఏకంగా 6500mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రోజంతా సోషల్ మీడియా వాడేవారికి, వీడియోలు చూసేవారికి, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ ఛార్జింగ్ బ్యాకప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!
వివో Y21 5G మోడల్ 6.74 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. కంటికి రక్షణగా బ్లూ లైట్ తగ్గించే సర్టిఫికేషన్ కూడా దీనికి ఉంది. అలాగే ఎండలో చూసినా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్‌ను కూడా అందించారు.
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. రోజువారీ పనులు, గేమింగ్, యాప్స్ వాడకానికి ఇది మంచి స్పీడ్‌ను అందిస్తుంది. ఇందులో డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. దుమ్ము, నీటి చుక్కల నుండి తట్టుకోవడానికి ఐపీ65 రేటింగ్ కూడా ఉంది.
ఫొటోల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్‌కు తగ్గట్టే మంచి ఫొటోలను అందిస్తుంది. వీటితో పాటు బ్లూటూత్, వైఫై, టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల సాధారణ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ కొనేముందు మీ వేరియంట్, ఆఫర్లు సరి చూసుకోవడం మంచిది.
Also Read: పాత స్నేక్ గేమ్‌తో కొత్త Nokia 3210 4G ఫోన్.. ఆఫర్ ధర చూస్తే అస్సలు వదలరు!