E-Paper
Advertisement

తెలంగాణ అర్చకులకోసం సర్కార్ కొత్త ప్లాన్.. దేవాదాయ శాఖలో ట్రైనింగ్!

తెలంగాణ అర్చకులకోసం సర్కార్ కొత్త ప్లాన్.. దేవాదాయ శాఖలో ట్రైనింగ్!
Advertisement

Priest Training: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద సేవలందిస్తున్న అర్చకులకు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని, నిర్వహణ మెళకువలను పెంపొందించేందుకు ప్రభుత్వం ‘సకల దేవతల ఆరాధన’ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టబోతుంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6,700 మంది అర్చకులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సకల దేవతల ఆరాధన..

రాష్ట్రంలోని గ్రామగ్రామాన ఉన్న దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిరంతరం కొనసాగడమే కాకుండా, ధార్మిక సంప్రదాయాలను భావితరాలకు పక్కాగా అందించేందుకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ధూపదీప నైవేద్య (డీడీఎన్) పథకం అర్చకులకు ‘సకల దేవతల ఆరాధన’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న రాష్ట్రంలోని సుమారు 6,700 మంది అర్చకులకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు.

మూడు రోజుల పాటు వర్క్‌షాపులు

Advertisement

స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ (సీత) ఆధ్వర్యంలో ప్రతిరోజూ 100 మంది అర్చకులకు చొప్పున, మూడు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాపులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా ఆగమ శాస్త్రం, నిత్య పూజా క్రతువులు, ఆలయ నిర్వహణ (అడ్మినిస్ట్రేషన్) వంటి కీలక అంశాలపై అర్చకులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించబోతున్నారు. కేవలం సిద్ధాంత పరంగానే కాకుండా, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో కూడా నిపుణులు వివరించనున్నారు.

Also Read: సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!

పరీక్షించి, సర్టిఫికేషన్..

Advertisement

శిక్షణ కార్యక్రమం ముగింపులో పాల్గొన్న అర్చకులకు సర్టిఫికేట్లు అందజేయనున్నారు. అలాగే, నేర్చుకున్న అంశాలపై వారిని తిరిగి ప్రశ్నించడం (ఆరా) ద్వారా అవగాహనా స్థాయిని అంచనా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అర్చకులు మరింత బాధ్యతాయుతంగా, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

శిక్షణ లక్ష్యం

ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహణ. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో కూడా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం, మంత్ర లోపం లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడం సీత లక్ష్యం. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని డీడీఎన్ దేవాలయాల్లో పూజా విధానంలో ఒకే విధమైన ప్రామాణికత తీసుకొచ్చేందుకు దేవాదాయశాఖ ముందుకు సాగుతోంది.అంతేకాదు అర్చకులకు కేవలం పూజలే కాకుండా ఆలయ పరిపాలన, లెక్కల నిర్వహణ, భక్తులతో ప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కల్పించబోతున్నారు.వివిధ దేవతల (శివ, విష్ణు, శక్తి, గణపతి, సుబ్రహ్మణ్య మొదలైన) ఆరాధనా క్రమాలు, విశిష్టతలపై స్పష్టత నివ్వనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో..

ఇప్పటికే హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ లో హైదరాబాద్, రంగారెడ్డి, వేములవాడ, భద్రాచలం, ఖమ్మం వంటి ప్రధాన కేంద్రాల్లో ఆలయ సిబ్బంది, అర్చకులకు శిక్షణ విజయవంతంగా పూర్తయింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.ఈ శిక్షణ తో గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లడమే కాకుండా, అర్చకులకు సమాజంలో మరింత గౌరవం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు

ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేందుకే శిక్షణ కార్యక్రమాలను శ్రావణ మాసంలో నిర్వహించబోతున్నాం. ఆగమ శాస్త్రం, నిత్య పూజా క్రతువులు, ఆలయ నిర్వహణ (అడ్మినిస్ట్రేషన్) వంటి కీలక అంశాలపై అవగాహన కల్పిస్తాం. డీడీఎన్ పథకం కింద ఉన్న ఆలయాల పూజారులకు సకల దేవతారాధనపై ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి రోజూ 100మందికి 3 రోజూలపాటు శిక్షణ ఇవ్వనున్నామని సీతా డైరెక్టర్ చిలుకపాటి విజయరాఘావాచార్యులు తెలిపారు.

శిక్షణ ఇలా..

మొదటి రోజు: ఆగమ శాస్త్రం, మంత్రోచ్ఛారణ
ఉదయం: జ్యోతి ప్రజ్వలన, శిక్షణ లక్ష్యాల వివరణ.
సెషన్ 1: ఆగమ శాస్త్ర ప్రాథమిక సూత్రాలు, వైఖానస, పాంచరాత్ర, శైవాగమ పద్ధతులపై అవగాహన.
మధ్యాహ్నం: వేద మంత్రాలు, సూక్తాలు (పురుష సూక్తం, శ్రీసూక్తం మొదలైనవి) స్పష్టమైన ఉచ్ఛారణతో వల్లె వేయించడం.
సాయంత్రం: సంధ్యావందనం, నిత్య పూజా సంకల్పం యొక్క ప్రాముఖ్యత.
రెండవ రోజు: సకల దేవతల ఆరాధన , పూజా క్రతువులు
ఉదయం: వివిధ దేవతల (శివ, విష్ణు, దుర్గ, గణపతి, హనుమాన్) అభిషేకాలు, షోడశోపచార పూజా విధానం.
మధ్యాహ్నం: యంత్ర పూజలు, హోమ క్రతువులు, విశేష పర్వదినాల్లో (నవరాత్రులు, శివరాత్రి, జయంతి ఉత్సవాలు) చేయాల్సిన ప్రత్యేక పూజలపై ప్రాక్టికల్ ట్రైనింగ్.
సాయంత్రం: ఆలయాల ప్రక్షాళన, సంప్రోక్షణ, అర్చకుల శౌచం (నియమావళి).
మూడవ రోజు: ఆలయ అడ్మినిస్ట్రేషన్, సర్టిఫికేషన్
ఉదయం: దేవాదాయ శాఖ నిబంధనలు, ఆలయ రిజిస్టర్ల నిర్వహణ, అకౌంట్స్ మెయింటెనెన్స్.
మధ్యాహ్నం: ‘భక్తుడే దేవుడు’ – ఆలయానికి వచ్చే భక్తులతో సంభాషణ, ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించడం, మర్యాదపూర్వక ప్రవర్తన.

Also Read: రూ.999కే బ్లూటూత్ కాలింగ్ వాచ్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కాకండి!

Tags

Related News

ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ.. లీకైన సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సీక్రెట్స్!

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

స‌బ్జెక్టు విడిచి క్షుద్ర‌పూజ‌ల‌ను త‌ల‌చి.. సీఎం నోటి వెంటా చేత‌బ‌డుల మాట‌.. జనం ఏమ‌నుకుంటున్నారు?

హరీశ్ రావు సంచలన లేఖ.. సీఎం రేవంత్ రెడ్డికి 5 కీలక ప్రశ్నలు!

రాజాసింగ్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి..?

2 సీట్లు.. 3 పార్టీలు.. పట్టుభద్రుల ఓటు ఎవరివైపు..?

రీల్స్ రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుంది?

Big Stories

Advertisement
×