E-Paper
Advertisement

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!
Advertisement

HYDRAA Prajavani: బ‌య‌ట వారికే కాదు, ఇరుగుపొరుగు కాలనీ వాసులు కూడా తమకు రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఒకే లే ఔట్‌లో ఫేజ్ -1, ఫేజ్ -2 ల పేరిట ఉన్న వాటి మ‌ధ్యే గోడ‌లు క‌డుతున్నారు. నివాస ప్రాంతాల్లో గొడ‌వ ప‌డాల్సి వ‌స్తోంద‌ని హైడ్రా ప్ర‌జావాణిలో పలుకాలనీల వాసుల ఫిర్యాదులు వెల్లువయ్యాయి. హైడ్రా అధికారులు స్పందించి మాకు దారి చూపాలంటూ కోకాపేట‌లోని లెజెండ్ చైమ్స్ ఫేజ్-2 కాల‌నీ నివాసితులు హైడ్రాను విజ్ఞ‌ప్తి చేశారు. కేపీహెచ్‌బీ కాల‌నీ సెవెంత్ ఫేజ్‌లో పై అంత‌స్తుల‌కు ఎలాంటి అనుమ‌తులు లేకుండా 80 గ‌జాల స్థ‌లంలో 7 అంత‌స్తులు నిర్మిస్తున్నార‌ని, వెంట‌నే ఆప‌ని ప‌క్షంలో ప‌క్క‌న ఉన్న నివాసాల‌కు ముప్పు పొంచి ఉంటుంద‌ని ఫొటోలు, వీడియోల‌ను చూపించి హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదును సమర్పించారు.

మొత్తం 47 ఫిర్యాదులు..

మెహిదీప‌ట్నంలోని సంతోష్‌న‌గ‌ర్ కాల‌నీలో ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా, అక్క‌డ అపార్టుమెంట్లు నిర్మించి ప్రైవేటు వ్యక్తులు ఆక్ర‌మిస్తున్నార‌ని, గ్రీన్ బెల్ట్ ఏరియాగా అభివృద్ధి చేయాల‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం ప‌సుమాముల గ్రామంలోని పార్కుకోసం కేటాయించిన స్థ‌లాన్ని క‌బ్జా చేసి ప్లాట్లుగా మార్చుతున్నార‌ని వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఇలా ప్ర‌జావాణికి మొత్తం 47 ఫిర్యాదులు అందగా, వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. అక్క‌డిక‌క్క‌డే వాటి పూర్వాప‌రాల‌లోకి వెళ్లి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

ఫిర్యాదులిలా..

Advertisement

కుత్బుల్లాపూర్ మండ‌లం గాజులరామారంలో 167 ఎక‌రాల్లో మ‌హ‌దేవ్‌పురం కాల‌నీ ఏర్ప‌డింది. ఇందులో 80 వేల గ‌జాల వ‌ర‌కు పార్కులు, ప్ర‌జావ‌సరాల‌కు కేటాయించారు. ఇప్పుడ‌వి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురవుతున్నాయి. కాల‌నీలోని పార్కులు ప్లాట్లుగా మారిపోతున్నాయి. దాదాపు స‌గం వ‌ర‌కూ క‌బ్జాలు జ‌రిగాయని, క‌బ్జాల‌ను తొల‌గించి కాల‌నీలోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో మ‌హ‌దేవ్‌పురం కాల‌నీ నివాసితులు ఫిర్యాదు సమర్పించారు. సికింద్రాబాద్‌లోని బొల్లారం, ద్వ‌రాకాపురి కాల‌నీలో అతిపెద్ద పురాత‌న‌ బావి ఉందని, ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయంతో పాటు తాగు నీటి అవ‌స‌రాల‌కు ఈ బావిని వినియోగించే వారని, ర‌హ‌దారికి ప‌క్క‌నే ఉన్న ఈ బావి ఇప్పుడు చెత్త డంపింగ్ కేంద్రంగా మారిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Also read: మనిషి vs రోబోట్.. బాక్సింగ్ రింగ్‌లో బిగ్ ఫైట్.. సినిమా కాదండోయ్ నిజం!

ప్ర‌జావాణిలో ఫిర్యాదు..

Advertisement

మెడిక‌ల్ వేస్ట్‌ను కూడా ఈ బావిలో వేస్తున్నారని, దీంతో అక్క‌డ దుర్గంధం వ్యాపించ‌డ‌మే గాక, ఆ మార్గంలో వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొందని వాపోయారు. భూగ‌ర్భ జ‌లాలు కూడా క‌లుషిత‌మవుతున్నాయని, హైడ్రా చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్న స‌మ‌యంలో వ‌చ్చిన ఈ బావిని మ‌ట్టితో నింపాల‌ని ద్వార‌కాపురి కాల‌నీ నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. పార్కుగా అభివృద్ధి చేయాల‌ని స్థానికులు హైడ్రాను కోరారు. కుత్బుల్లాపూర్ మండ‌లం, గాజుల‌రామారంలోని ప‌ర్కి చెరువును అభివృద్ధి చేయాల‌ని మ‌హ‌దేవ్‌పురం డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసింది. స్వ‌చ్ఛ‌మైన నీటితో ఉన్న ఈ చెరువులోకి పారిశ్రామిక వ్య‌ర్థాలు, మురుగు నీరు క‌లిసి క‌లుషిత‌మైపోయింద‌ని, దీంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తున్న వారు రోగాల భారిన ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. భూగ‌ర్భ జ‌లాలు కూడా క‌లుషిత‌మై చ‌ర్మ వ్యాధుల‌తో పాటు శ్వాస‌కోస వ్యాధులతో ఇబ్బందుల పాల‌వుతున్నామ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు.

పురాత‌న నీటి గుండం..

హైడ్రా పున‌రుద్ధ‌రిస్తున్న చెరువుల జాబితాలో ప‌రికి చెరువును కూడా చేర్చాల‌ని కోరారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం, చింత‌ల్‌మెట్ గ్రామంలోని శ్రీ హ‌స్తాల వీర‌భ‌ద్ర స్వామి దేవాల‌యానికి సంబంధించిన భూమి, పురాత‌న నీటి గుండం ఉన్నాయని, ఇప్పుడు వాటిని క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యిస్తున్నారని, ఆక్ర‌మించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా రంగంలోకి దిగి దేవాల‌యానికి చెందిన భూమితో పాటు పురాత‌న నీటి గుండంను కాపాడాల‌ని చింత‌ల్‌మెట్ గ్రామ ప్ర‌జ‌లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్-మ‌ల్కాజ్ గిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం, ఆంకుషాపూర్ విలేజ్‌లో 212, 231, 209 స‌ర్వే నెంబర్లలోని 18 ఎక‌రాల మేర సాయికృష్ణాన‌గ‌ర్ ఎ,బీ,సీ పేరిట లే ఔట్ వేశారు.

దాదాపు 300 ప్లాట్లు..

ఇందులో స‌ర్వే నెంబ‌రు 209లో ప్లాట్లు అమ్మ‌కాలు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో లే ఔట్‌ను, అదే స‌ర్వే నెంబర్ వ‌ర‌కూ ర‌ద్దు చేశారని, 212, 231 స‌ర్వే నెంబ‌ర్ల‌లోని ఏ,బీ సెక్టార్ల‌లో దాదాపు 300 వ‌ర‌కూ ప్లాట్లున్నాయని, ఇందులో ప్లాట్లు అమ్ముడ‌ుపోవటం, 2011లో కొన్నిటికి ఎల్ ఆర్ ఎస్ రావ‌డం కూడా వచ్చిందని తెలిపారు. అయితే ఆ భూమిని అమ్మిన వారి వార‌సులు ఇప్ప‌డు ఏబీ సెక్టార్ల‌లోని పార్కులు, ర‌హ‌దారులను క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని, వాటిని కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో సాయికృష్ణాన‌గ‌ర్ నివాసితులు ఫిర్యాదు చేశారు.

Also read: అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

Tags

Related News

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!

తెలంగాణ పోటీపరీక్షల్లో సిలబస్ మార్పులు.. క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

Big Stories

Advertisement
×