E-Paper
Advertisement

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే
Advertisement

Abhijeet Dipke: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సీజేపీ ఫౌండర్, కన్వీనర్ అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్న ఆయన 48 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం పనితీరుపై ఇటీవల వెలువడిన ఒక సంచలన నివేదికను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

13 కోట్లకు పైగా ఓట్ల రద్దు?

Advertisement

జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని దీప్కే ఆరోపించారు. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 12.4% నుండి 14% వరకు ఉంటుందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటమి మధ్య గెలుపోటముల తేడా కేవలం 2 శాతం మాత్రమేనని గుర్తుచేసిన ఆయన, ఆ వ్యత్యాసాన్ని ప్రభావితం చేయడానికే ఉద్దేశపూర్వకంగా ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు.

మమత, స్టాలిన్, కేజ్రీవాల్ నియోజకవర్గాల్లో ఓట్ల కోత..

Advertisement

గత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు ఈ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కే. స్టాలిన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, కేరళలో పినరయి విజయన్ వంటి ప్రముఖ ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలు, రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఓట్లను తొలగించడం వల్లే వారు స్వల్ప తేడాతో దెబ్బతిన్నారని పేర్కొన్నారు.

ప్రశ్నించిన అభిజిత్ దీప్కే

ఇలా ఏకపక్షంగా ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసేలా లక్షలాది ఓట్లను రద్దు చేస్తుంటే, దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు ఎలా జరుగుతాయని అభిజిత్ దీప్కే ఘాటుగా ప్రశ్నించారు.

Also Read: కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

Tags

Related News

వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

Big Stories

Advertisement
×