E-Paper
Advertisement

మహిళలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కౌంటర్‌గా కేంద్ర మంత్రి చురకలు!

మహిళలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కౌంటర్‌గా కేంద్ర మంత్రి చురకలు!
Advertisement

Rahul Gandhi: మహిళల భాగస్వామ్యం, వారి భావప్రకటనా స్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు క్షణాల్లోనే కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

మహిళల శక్తి బంధీ అయింది- రాహుల్ గాంధీ

Advertisement

భారతీయ మహిళల శక్తి ప్రస్తుతం బంధించబడి ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. తమ ఆలోచనలను, ఆకాంక్షలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం వారికి లభించడం లేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మహిళా భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ విజయం సాధించలేదని చెప్పారు. సమాజంలో మహిళల భావప్రకటన లేకపోతే దేశం స్తబ్ధంగా, అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. రాజకీయాల తీరు మారాలని, మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రజల్లో అవగాహన పెంచడమే తన రాజకీయాల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

Also Read: బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది!

Advertisement

రిజిజు స్మార్ట్ కౌంటర్

రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెంటనే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సానుకూల సందేశం వచ్చినట్లు కనిపిస్తోందని, మహిళల పట్ల రాహుల్ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతపై అంత నిజాయితీ ఉంటే.. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని రిజిజు సూచించారు.

రిజిజుకి రాహుల్ గాంధీ కౌంటర్..

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న రిజిజు , మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023 కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో, ఎటువంటి అంగీకారం లేకుండా ఇప్పటికే ఆమోదించబడిందనే విషయం మీకంటే బాగా ఎవరికి తెలుసు? అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘మూడేళ్లు గడిచినా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు చేయలేదు. మీరు దానిని అనవసరంగా డీలిమిటేషన్‌కు ఎందుకు ముడిపెట్టాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా.. వెంటనే 2023 చట్టాన్ని అమలు చేయండి అంటూ డిమాండ్ చేశారు.

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×