E-Paper
Advertisement

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగ స్పీడ్ పెంచాడు, త్రిప్తి దిమ్రి సీన్స్ మొదలయ్యేది అప్పుడే

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగ స్పీడ్ పెంచాడు, త్రిప్తి దిమ్రి సీన్స్ మొదలయ్యేది అప్పుడే
Advertisement

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్పిరిట్. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా కొన్ని రోజుల ముందే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలుపెట్టడానికి టైం తీసుకుంటాడు. కానీ ఒకసారి మొదలు పెట్టిసిన తరువాత ఆ సినిమాను త్వరగా పూర్తి చేయగలిగే టాలెంట్ ఉన్న దర్శకుడు. స్వతహాగా ఎడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఏ సీన్ ఎంతవరకు తీస్తే సరిపోతుంది అని ఒక క్లారిటీ ఉంటుంది.

అటువంటి క్లారిటీ ఒక దర్శకుడుకు ఉన్నప్పుడు సినిమా తీస్తున్నప్పుడే తనకు తెలిసిపోతుంది. అనిమల్ సినిమాని కూడా సందీప్ రెడ్డి వంగ ఎడిట్ చేసుకున్నాడు. ఇకపోతే యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి జోయా అనే పాత్రలో కనిపించింది. ఆ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికి ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసిన సీన్స్ వైరల్ గా మారుతుంటాయి.

త్రిప్తి దిమ్రి సీన్స్ మొదలైపోతున్నాయి 

Advertisement

స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా మొదట దీపికా పదుకొనేను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆమె సినిమా నుంచి తప్పుకోవలసి వచ్చింది. కేవలం సందీప్ రెడ్డి వంగ సినిమా నుండి మాత్రమే కాకుండా కల్కి సినిమా నుంచి కూడా ఆమెను తప్పించారు. కొంతమంది దీనిని తప్పు పట్టినా కూడా ఆమె పెట్టిన కండిషన్స్ రిక్వైర్మెంట్స్ వలనే పక్కకు తప్పించినట్లు ఇండస్ట్రీవర్గాల్లో వార్తలు వినిపించాయి.

దీపికా పదుకొనే సినిమా నుండి వెళ్లిపోయిన తర్వాత సందీప్ ఏమీ కంగారు పడకుండా త్రిప్తి దిమ్రి ను హీరోయిన్ గా ప్రకటించాడు. ఇలా ప్రకటించడం అనేది పోకిరి లెవెల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన ఆమెకు హీరోయిన్ పాత్ర ఇవ్వడం అనేది సందీప్ గట్స్. మొత్తానికి ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం పొందుకుంది త్రిప్తి దిమ్రి.

Advertisement

ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెట్స్ లో రేపటి నుంచి జాయిన్ కానున్నారు త్రిప్తి దిమ్రి. ఈమెతో పాటు జరిగే కొన్ని కీలక సీన్స్ ను రేపటి నుంచి తెరకెక్కించనున్నారు.

స్పీడ్ పెంచిన సందీప్ 

ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది దర్శకులు సినిమా చేయడానికి సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ మాత్రం కేవలం 6 నెలల్లోనే సినిమాలు పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ ఆరు నెలలు కూడా ప్రభాస్ పబ్లిక్ ఫంక్షన్స్ కి హాజరు కాకుండా ఉండాలి అని రిక్వెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది.

అందుకే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమంలో కూడా ప్రభాస్ కనిపించకుండా కేవలం తన చేతి వేళ్ళు మాత్రమే కనిపించేలా క్లాప్ బోర్డు ఫొటోస్ విడుదల చేశారు. మొత్తానికి ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే చాలామందికి షాక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ.

Also Read: Bigg Boss 9 : బాబు నీ హెల్త్ బాలేదు నువ్వు బయటికి వెళ్లిపో, ఇదెక్కడి నామినేషన్ సుమన్ అన్న?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×