E-Paper
Advertisement

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?
Advertisement

Varanasi Movie Update:వారణాసి ..సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.ఇక ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.
పైగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినీ గా ,మళయాళ స్టార్ పృథ్వి రాజ్ సుకుమార్ కుంబ పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎప్పుడు వదులుతావు జక్కన్నా

Advertisement

అయితే అంతా బాగానే ఉంది కానీ సినిమా నుండి ఒక్క అప్ డేట్ ఎప్పుడు వదులుతావు జక్కన్నా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫాన్స్ .అప్పుడెప్పుడో గ్లోబల్ ట్రాటర్ అంటూ ఒక ఈవెంట్ పెట్టి వదిలిన గ్లిమ్స్ తప్ప ఇప్పటికి మరో అప్ డేట్ వదలకపోవడంతో డీలా పడిపోయారంతా .

పైగా మహేష్ బాబు బర్త్ డే అయిన ఆగస్టు 9న వారణాసి సినిమా నుండి ఒక సాలిడ్ అప్ డేట్ అయినా వస్తుందని ఎదురుచూసారు ఘట్టమనేని అభిమానులు .టీజర్ అని ఒకరు ,సాంగ్ అని ఒకరు ,మేకింగ్ అని ఒకరు ..ఇలా ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు సినిమా అప్ డేట్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసుకున్నాడు .కానీ అబ్బే అంత సీన్ లేదంటూ కానీ చాలా సింపుల్‌గా కొన్ని స్టిల్స్‌తో సరిపెట్టి  అభిమానులకి పెద్ద షాకే ఇచ్చాడు జక్కన్న.

Advertisement

విజయ దశమికి  పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం

ఇలా ఎన్ని సారాలు డిసప్పాయింట్ చేసినప్పటికీ మరోసారి ‘వారణాసి’ నెక్స్ట్ అప్డేట్‌పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే వచ్చే విజయ దశమికి (దసరా) ఈ సినిమా నుంచి పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది.

అంతేకాదు.. దసరా నుంచి ప్రమోషన్స్‌ను వేగం పెంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.అయితే ఎన్ని రకాల వార్తలు వినిపిస్తున్నా మహేష్ ఫ్యాన్స్ మాత్రం మేము నమ్మము దొరా అంటూ లైట్ తీసుకుంటున్న పరిస్థితి.

ఇదీ మరో బిస్కెట్టేమో అంటూ కౌంటర్లు

కారణం ‘వారణాసి’ విషయంలో ఇలాంటి అప్డేట్ బజ్‌లు గతంలో ఎన్నో సార్లు వచ్చాయి.త్వరలో భారీ అప్డేట్”, “స్పెషల్ డే రోజున సర్‌ప్రైజ్”, “మరో రెండు రోజుల్లో క్లారిటీ”, “ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ” అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు అంతా .కానీ తీరా ఏదీ రాక ఆసక్తిని మొత్తం నీరు గార్చేశాయి.

దీంతో ఇప్పుడు దసరా రోజున బిగ్ బ్లాస్ట్ అవుతుంది అన్న గాసిప్స్ విన్న ఫాన్స్ అప్ డేట్ కోసం మరో అప్ డేట్ ఎందుకు ..?ఆ అప్ డేట్ ఎదో డైరెక్ట్ గానే ఇవ్వొచ్చుగా..ఏమో బ్లాస్ట్ అవుతుందో లేక ఇదీ మరో బిస్కెట్టేమో అంటూ కౌంటర్లు వేస్తున్నారు ఘట్టమనేని ఫాన్స్ .

ALSO READ:‘ఎపిక్’కు ఫస్ట్ డేనే షాక్.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్

వచ్చే ఏడాది మార్చి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది మార్చి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.చూడాలి మరి వినిపిస్తున్నట్టుగా దసరాకి అప్ డేట్ వస్తుందా లేక ఎప్పటిలాగే అది మరో రూమర్ అని తేలిపోతుందా !

Tags

Related News

80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..

ఇద్దరు స్టార్ హీరోలు వస్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

‘ఎపిక్’కు ఫస్ట్ డేనే షాక్.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్

80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

Big Stories

Advertisement
×