E-Paper
Advertisement

జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Crime Thriller Series on OTT: చట్టాన్ని కాపాడాల్సిన ఓ ప్రభుత్వ న్యాయవాదే… అదే చట్టానికి వ్యతిరేకంగా నడిచే క్రైమ్ సిండికేట్‌లోకి గూఢచారిగా వెళ్లాల్సి వస్తే ? 14 ఏళ్లుగా చనిపోయాడనుకున్న సొంత అన్నయ్య బతికే ఉన్నాడని… అతనే జైలు నుంచే ఓ ప్రమాదకరమైన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని తెలిస్తే ? అంతకంటే షాకింగ్‌గా, తన తమ్ముడి ప్రాణాల కోసం అదే గ్యాంగ్‌లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ? కుటుంబం కోసం చట్టాన్ని పక్కన పెట్టాలా ? లేక చట్టం కోసం సొంత రక్తాన్నే వదులుకోవాలా ? ఇలాంటి ఉత్కంఠభరితమైన క్రైమ్, ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన సౌత్ ఆఫ్రికన్ వెబ్ సిరీస్ ‘ఉమ్తెతో’ (Umthetho). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఎంబాలీ డ్లామిని ఓ ప్రతిభావంతమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్. చట్టంపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంటుంది. నేరం చేసినవారు ఎంత శక్తివంతులైనా… చట్టం ముందు శిక్ష అనుభవించాల్సిందే అనేది ఆమె నమ్మకం. నేరస్థులను చట్టబద్ధంగా శిక్షించడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తూ ముందుకు సాగుతుంది. ఎంబాలీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓ పెద్ద విషాదం ఉంటుంది. ఆమె అన్నయ్య మోసెస్ 14 ఏళ్ల క్రితమే చనిపోయాడని కుటుంబం భావిస్తూ ఉంటుంది. అన్నయ్య జ్ఞాపకాలతోనే ఎంబాలీ కూడా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అతను ఇక తిరిగి రాడనే నిజాన్ని అంగీకరించినట్టుగానే ఉంటుంది.

Advertisement

కానీ ఒకరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిజం బయటపడుతుంది. మోసెస్ చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు. అంతేకాదు… జైలులో ఉంటూనే ‘ఐగాజ్లామ్’ అనే అత్యంత ప్రమాదకరమైన క్రైమ్ సిండికేట్‌ను నడుపుతున్నాడని ఎంబాలీకి తెలుస్తుంది. ఇన్నేళ్లుగా చనిపోయాడని అనుకున్న తన అన్నయ్య ఓ క్రిమినల్ గ్యాంగ్‌కు నాయకుడిగా మారాడనే నిజాన్ని ఎంబాలీ జీర్ణించుకోలేకపోతుంది. తాను జీవితాంతం నమ్మిన చట్టం ఒకవైపు ఉంటే… తన కుటుంబానికి చెందిన వ్యక్తి మరోవైపు నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. అన్నయ్యపై ఉన్న అనుబంధం, అతను చేస్తున్న నేరాలపై ఉన్న వ్యతిరేకత మధ్య ఆమె తీవ్రంగా సంఘర్షణకు గురవుతుంది.

కథలో అసలు సమస్య మాత్రం అక్కడితో ఆగదు. ఎంబాలీ చిన్న తమ్ముడు స్పెలేలే అనుకోకుండా అదే క్రైమ్ సిండికేట్‌కు సంబంధించిన ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అతని ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంబాలీ ముందున్నది ఒక్కటే ప్రశ్న. తన తమ్ముడిని ఎలా కాపాడాలి ? పోలీసుల సహాయం తీసుకుంటే… కుటుంబం గురించి మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. చట్టాన్ని ఆశ్రయిస్తే… తన అన్నయ్య మోసెస్ నడుపుతున్న నేర సామ్రాజ్యంపై చర్యలు తప్పవు. మరోవైపు ఏమీ చేయకుండా ఉంటే తన తమ్ముడి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.

Advertisement

దీంతో ఎంబాలీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. తాను నమ్మిన చట్టాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి… తన అన్నయ్య నడుపుతున్న క్రైమ్ సిండికేట్‌లోకి డబుల్ ఏజెంట్‌గా అడుగుపెడుతుంది. బయటకు చూస్తే ఆమె మోసెస్‌కు, అతని గ్యాంగ్‌కు సహాయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అసలు లక్ష్యం మాత్రం ఆ క్రైమ్ నెట్‌వర్క్‌లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడం, తన తమ్ముడిని సురక్షితంగా బయటకు తీసుకురావడం. ఒక చిన్న తప్పు జరిగినా ఆమె అసలు గుర్తింపు బయటపడే ప్రమాదం ఉంటుంది.

ఇదే సమయంలో మోసెస్‌తో ఎంబాలీ సంబంధం కూడా మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇన్నేళ్ల తర్వాత అన్నయ్యను చూసిన ఆనందం ఒకవైపు ఉంటే… అతని చేతుల్లో నడుస్తున్న నేర సామ్రాజ్యాన్ని చూసి కలిగే అసహ్యం మరోవైపు ఉంటుంది. అన్నయ్యను కాపాడాలా? అతని నేరాలను బయటపెట్టాలా? అనే ప్రశ్న ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు… తాను పనిచేసే న్యాయ వ్యవస్థకు తెలియకుండా క్రిమినల్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఎంబాలీ ఎప్పుడైనా పట్టుబడొచ్చు. తన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు గ్యాంగ్ తనను నమ్మాలి.. మరోవైపు తాను నమ్మిన చట్టాన్ని పూర్తిగా మోసం చేయకూడదు. ఈ రెండు ప్రపంచాల మధ్య ఆమె చేసే ప్రయాణమే సిరీస్‌లో ప్రధాన ఉత్కంఠగా మారుతుంది.

చివరకు ఎంబాలీ తన తమ్ముడిని ప్రాణాలతో కాపాడుకోగలిగిందా ? మోసెస్ నడుపుతున్న క్రైమ్ సిండికేట్ అసలు ఎంత పెద్దది ? తన అన్నయ్యను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎంబాలీ ఏం చేస్తుంది ? కుటుంబం కోసం చట్టాన్ని త్యాగం చేస్తుందా ? లేక చట్టం కోసం సొంత అన్నయ్యకు వ్యతిరేకంగా నిలబడుతుందా ? అనే ప్రశ్నలే ‘ఉమ్తెతో’ కథను ముందుకు నడిపిస్తాయి.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ?

నోబిలే నును ఖుమాలో, టోనీ క్గోరోగే, గివెన్ స్టూర్‌మన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్‌ లో కుటుంబం కోసం మనిషి ఎంత దూరం వెళ్లగలడనే ఎమోషనల్ యాంగిల్‌ను చూపించారు. ముఖ్యంగా చట్టం ఒకవైపు… సొంత రక్తం మరోవైపు అనే కాన్సెప్ట్‌తో సాగే ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కొనసాగుతుంది. మొత్తం 7 ఎపిసోడ్‌ల ‘ఉమ్తెతో’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. బ్రెజిలియన్ హిట్ సిరీస్ ‘బ్రదర్‌హుడ్’ ఆధారంగా రూపొందిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ను థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Read Also: 10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×