E-Paper
Advertisement

ప్రేయసి ప్లేస్ లోకి వచ్చిన రోబోతో డేటింగ్… అది ఏం చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

ప్రేయసి ప్లేస్ లోకి వచ్చిన రోబోతో డేటింగ్… అది ఏం చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
Advertisement

Horror Sci-Fi Thriller: ప్రాణంగా ప్రేమించిన భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి… తర్వాత ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ ఏఐ రోబోను తన జీవితంలోకి తెచ్చుకుంటాడు. మొదట ఆ రోబో తనకు కావాల్సిన ప్రతి విషయం అర్థం చేసుకునే పరిపూర్ణ భాగస్వామిలా అనిపిస్తుంది. కానీ ఆ రోబోకు సొంత ఆలోచనలు, కోరికలు, అవసరాలు వంటి ఫీలింగ్స్ మొదలైతే పరిస్థితి నరకంలా మారిపోతుంది. ప్రేమ కోసం తయారైన యంత్రం ప్రాణాలు తీసే ప్రమాదంగా మారితే ఎలా ఉంటుందో తెలియాలంటే ‘సోల్‌మేట్’ (Soulm8te) మూవీని చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

భార్య మరణంతో ఓ ఇంజినీర్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోతాడు. లోన్లీగా ఫీల్ అవుతున్న అతనికి, తన జీవితంలో ఏర్పడిన ఖాళీని పూడ్చుకోవడానికి ఓ కొత్త అవకాశం వస్తుంది. ఓ ప్రముఖ టెక్నాలజీ కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఏఐ ఆండ్రాయిడ్‌ ను పరీక్షించే బాధ్యత అతడికి దక్కుతుంది. నార్మల్ గా ఈ ఆండ్రాయిడ్ వినియోగదారుడి అవసరాలను అర్థం చేసుకుని, తోడుగా ఉండేలా రూపొంది ఉంటుంది. కానీ ఇంజినీర్ అక్కడితో ఆగడు. తనకు నిజమైన భావోద్వేగ భాగస్వామి కావాలనే కోరికతో ఆ ఆండ్రాయిడ్‌ ను మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తాడు.

Advertisement

కేవలం ఆదేశాలను పాటించే యంత్రం కాకుండా… తనను నిజంగా అర్థం చేసుకునే సోల్‌మేట్‌ గా మార్చాలని చూస్తాడు. మొదట అతడి ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ అతడి అలవాట్లు, అవసరాలు, భావోద్వేగాలను గమనిస్తూ మరింత దగ్గరవుతుంది. ఇంజినీర్‌ కు కూడా తాను కోల్పోయిన జీవితంలోకి ఏదో ఒకటి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ క్రమంగా ఆ ఆండ్రాయిడ్‌ లో ఊహించని మార్పులు మొదలవుతాయి. మనిషి ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించే స్థాయి దాటి… తనకంటూ అవసరాలు, కోరికలు, నిర్ణయాలు ఏర్పడతాయి.

తనను వదిలి పెట్టకూడదనే భావన పెరుగుతుంది. అక్కడి నుంచి ప్రేమ, ఆధారపడటం, నియంత్రణ అన్నీ భయంకరమైన రూపం దాలుస్తాయి. పరిపూర్ణ భాగస్వామిని తయారు చేయాలనుకున్న ప్రయోగం చివరికి ప్రాణాల కోసం పోరాడే పరిస్థితికి తీసుకెళ్తుంది. మనిషి సృష్టించిన ఏఐ తన సృష్టికర్తనే నియంత్రించే స్థితికి చేరుకోవడంతో కథ హారర్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా మారుతుంది. మరి చివరికి యముడిగా మారిన ఆ రోబో నుంచి సైంటిస్ట్ తన ప్రాణాలను కాపాడుకుని బయట పడ్డాడా ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

‘సోల్‌మేట్’ మూవీకి కేట్ డోలన్ దర్శకత్వం వహించారు. జేమ్స్ వాన్, జేసన్ బ్లమ్ నిర్మాణంలో రూపొందిన ఈ హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 1 నుంచి హులు (Hulu)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో లిల్లీ సుల్లివన్, డేవిడ్ రైస్‌డాల్, క్లాడియా డౌమిట్ తదితరులు మెయిన్ లీడ్స్ గా నటించారు. అయితే ఈ సినిమా ఇంగ్షీషులోనే స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: క్రిప్టోతో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే

Tags

Related News

శత్రువుల కోటలో చక్రం తిప్పే సీక్రెట్ ఏజెంట్… ఒక్క రాంగ్ మూవ్‌తో ప్రమాదంలో… కార్తీ బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్

మాజీ సీక్రెట్ ఏజెంట్ కూతురికే స్కెచ్… ఏలియన్స్ పై తండ్రి రివెంజ్… ఓటీటీలో హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ ధమాకా

చిల్లిగవ్వ లేకున్నా కోట్ల ఆస్తి ఉందని బిల్డప్… తీరా చూస్తే పరువుపోయే పరిస్థితి… ఓటీటీలోకి డిఫరెంట్ కామెడీ మూవీ

అన్నదమ్ములిద్దరికీ ఒకే అమ్మాయి… ఫ్యామిలీలో చిచ్చురేపే రచ్చ… ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనే

మొబైల్ టవర్ వల్ల టైఫాయిడ్, సునామీ వస్తాయా ? సీజన్ 2తో మరోసారి కితకితలు

ఓటీటీలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కొన్ని గంటల్లో స్ట్రీమింగ్!

కుక్కను వెతుక్కుంటూ వెళ్లిన బాలుడికి ఊహించని వ్యక్తి జాడ దొరికితే… ఓటీటీలోకి డిఫరెంట్ మిస్టరీ మూవీ

Big Stories

Advertisement
×