E-Paper
Advertisement

బిహార్‌లో మళ్లీ బరితెగించిన ఆకతాయిలు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై వికృత దాడి!

బిహార్‌లో మళ్లీ బరితెగించిన ఆకతాయిలు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై వికృత దాడి!
Advertisement

Bihar Crime: బిహార్‌లో వరుస వేధింపుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యువతి పట్ల ఆరుగురు యువకులు అమానుషంగా ప్రవర్తించిన వీడియో తాజాగా వెలుగు చూసింది. పర్యాటక ప్రాంతమైన బంకా జిల్లా మందార్ హిల్‌ వద్ద సెప్టెంబర్ 3న ఈ దారుణం జరగ్గా.. ఆలస్యంగా దాడి దృశ్యాలు బయటకొచ్చాయి. అందులో కొంతమంది యువకులు యువతిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తిస్తూ చెప్పులతో కొడుతూ కనిపించారు.

రంగంలోకి పోలీసులు..

యువతిపై చెప్పులతో దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బౌన్సి స్టేషన్ ఎస్‌హెచ్ఓ పంకజ్ కుమార్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాల ఆధారంగా ఆరుగురు ఆకతాయిలపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

Advertisement

నిందితుల కోసం గాలింపు

వీడియోలో కనిపిస్తున్న యువతితో పాటు దాడికి పాల్పడిన యువకులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మందార్ హిల్ సమీపంలోని గ్రామస్థులను, స్థానిక వ్యాపారులను పోలీసులు విచారించారు. వీడియోలో ఉన్నవారు స్థానిక యువకులే అయి ఉండవచ్చని వ్యాపారులు భావించినప్పటికీ వారిని స్పష్టంగా గుర్తించలేకపోయారు. నిందితుల ఆచూకీ తెలియగానే.. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Also Read: యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

భద్రతపై ఆందోళన

ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలోనూ ఇలాంటి ఘోరం జరగడంతో అక్కడి భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు బీహార్‌లో వరుసగా వెలుగుచూస్తున్న వేధింపుల ఘటనలు ఆ రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జముయి జిల్లాలో పదో తరగతి అమ్మాయి, అబ్బాయిపై ఆకతాయిల వేధింపులకు పాల్పడ్డ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సమస్తిపూర్‌లోనూ బైక్‌లపై వచ్చి ఒక జంటను వేధించి, దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?

Tags

Related News

యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!

‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి.. తక్షణమే రాజీనామా చేయాలి’.. రాహుల్ సంచలన డిమాండ్!

జ్ఞానేష్ గేట్ నిజంగానే స్కామా? 13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక అసలేం జరిగింది?

వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

Big Stories

Advertisement
×