E-Paper
Advertisement

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Advertisement

Raidurgam Land: రాయదుర్గం పాన్​ మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏ విషయాన్నయినా తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. రాయదుర్గం పాన్​ మక్తాలోని రెండు సర్వే నెంబర్లలో ఉన్న 11 ఎకరాల భూమిని అమ్మేందుకు టీజీఐఐసీ వేలం జరపాలని నిశ్చయించింది. అయితే దీనిపై జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్​ దాఖలు చేశారు.

దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్​ తరపు న్యాయవాది నీరజ్​ కిషన్​ కౌల్​ వాదనలు వినిపిస్తూ గతంలో కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు రక్షించమని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని తెలిపారు.

Advertisement

Also Read: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ.. పిటిషనర్​ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కంచె గచ్చిబౌలి భూములకు ఇప్పుడు వేలం వేయటానికి నోటిఫికేషన్​ ఇచ్చిన భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ భూములు కంచె గచ్చిబౌలి భూములకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు భూముల వేలానికి సంబంధించి టీజీఐఐసీ ఇచ్చిన నోటిఫికేషన్​ లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది.

Advertisement

Also Read: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×