E-Paper
Advertisement

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ త‌న్వీర్ సీరియ‌స్‌

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ త‌న్వీర్ సీరియ‌స్‌
Advertisement

Tanveer Ahmed On ENG VS PAK:  ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. అందరూ ముందుగా ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ కకావికలమైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ చేతిలో 103 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమి చవిచూసింది. అయితే పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచారని ఆగ్రహించారు. కెప్టెన్ సల్మాన్ చూయింగ్ గమ్ నమ్మడం తప్ప ఆడిందేమీ లేదని ఫైర్ అయ్యారు.

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి…3 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్‌

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం 3 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత ఇంగ్లాండులో పర్యటించిన పాకిస్తాన్.. సిరీస్ గెలుస్తుందని చాలామంది నమ్మారు. కానీ ఈ నమ్మకాన్ని తలకిందులు చేస్తూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచి, తొలి మ్యాచ్ లోనే ఓడిపోయింది. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 19వ తేదీన లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 171 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండు 409 పరుగులు చేసింది. దీంతో అప్పటికే పాకిస్తాన్ ఓడిపోయిందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే రెండో ఇన్నింగ్స్ లో 135 పరుగులకు పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు.. ఏకంగా 103 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే ఫినిష్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విజ‌యంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 లీడింగ్ సంపాదించింది ఇంగ్లాండ్.

పాకిస్తాన్ చెత్త రికార్డు

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో అత్యంత దారుణంగా తొలి టెస్ట్ లో ఓడిపోయిన పాకిస్తాన్… చెత్త రికార్డును మూట గట్టుకుంది. టెస్టుల్లో సున్నా పరుగులకే తొలి వికెట్ ఎక్కువ సార్లు కోల్పోయిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఇదే సీన్‌ రిపీట్ చేసింది పాకిస్తాన్. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ లిస్టులో ఉన్నాయి.

పాకిస్తాన్ ఓటమిపై తన్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇంగ్లాండ్ చేతిలో రెండున్నర రోజుల్లోనే తొలి టెస్ట్ లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి తన్వీర్ అహ్మ‌ద్ సీరియస్ అయ్యారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు చెత్త ప్రదర్శన కనబరిచారని ఒప్పుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్.. ప్రదర్శన చాలా దారుణంగా ఉందని ఆగ్రహించారు. బ్యాటింగ్, ఫీలింగ్, అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో ఇలా ఎక్కడ కనిపించినా అతడు చూయింగ్ గమ్ నములుకుంటూ కనిపించాడు తప్ప… మ్యాచ్ పైన ఫోకస్ చేయలేదని ఆగ్రహించారు. అదే సమయంలో ఇంగ్లాండ్ ను ఓడించేందుకు ఐసీసీ కుట్రలు చేసిందని కూడా ఆగ్రహించారు.

 

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చూస్తే అస‌హ్యం వేస్తోంది..మీ కంటే, ఉగాండా బెట‌ర్‌

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..DKపై త‌న్వీర్ ఫైర్‌

నాకు కెప్టెన్సీ ఇవ్వండి..లేకపోతే వేలంలో వదిలేయండి.. CSKకు సంజు వార్నింగ్ ?

40 కోట్ల టాకాల న‌ష్టం…బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ర‌ద్దు

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

Big Stories

Advertisement
×