Special Police: సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. తద్వారా తాత్కాలిక ప్రాతిపదికన 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 5గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు 26వేలు ఇస్తారు.
Also Read: అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి
అభ్యర్థులు ఆగస్టు 31నాటికి 58 సంవత్సరాల వయస్సు దాటకూడదు. మాజీ పారామిలటరీ, రిటైర్డ్ పోలీసులు గత రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్, ఫోన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించరు. అర్హులైన అభ్యర్థులు నేరుగా హైదరాబాద్‌లోని పెట్లబుర్జు వద్ద ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లోని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫీస్‌కు స్వయంగా వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. డిశ్చార్జ్ బుక్, రిటైర్మెంట్ ఆర్డర్, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్లాలి.
Also Read: మేడ్చల్‌లో బయటపడ్డ భారీ స్కామ్.. అహ్మదాబాద్ లారీలో ఊహించని దృశ్యాలు!