E-Paper
Advertisement

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి
Advertisement

Vijay Sethupathi Rajinikanth:హీరోలకి ఫాన్స్ ఉండటం కామన్ ,కానీ నటులకి ఫాన్స్ ఉండటం కొంచెం రేర్ .ఇదిగో అలా లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకున్న అలాంటి రేర్ నటుల్లో ఒకరు విజయ్ సేతుపతి.

సినిమా ఏదైనా ..హీరో ఎవరైనా ..తనదైన నటనతో కట్టిపడేసే ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా సూపర్ స్టార్ రజినీ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు.విషయంలోకి వెళ్తే విజయ్ సేతు పతి తాజాగా బాలాజీ తరణీతరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బత్తా’సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఇటు ట్రేడ్ వర్గాల్లో,అటు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది కూడా .ఇక తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరగగా ఈ ఈవెంట్ లో విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని 

Advertisement

చెన్నైలోని సత్యబామ ఇంజినీరింగ్ కాలేజీలో ‘బత్తా’ ఆడియో వేడుకను ఘనంగా జరగగా .. ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి ,అలాగే తనకు స్ఫూర్తినిచ్చిన నటుల గురించి మనసులోని మాటల్ని ఇలా బయటపెట్టాడు విజయ్ సేతుపతి.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టాడు. తన కెరీర్‌లో తాను ఎంతగానో గమనించిన వ్యక్తి రజనీకాంత్ అని చెప్పిన ఆయన..ఆయనలో ఉన్న డెడికేషన్ తనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని చెప్పాడు.

ఇంత సీనియర్ నటుడైనప్పటికీ

ఇక ఈమధ్యనే ‘జైలర్ 2’ షూటింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి ఓ సీన్ లో నటించిన అనుభవాన్ని విజయ్ సేతుపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఆ సీన్ చాలా చిన్నదేనని, ఇద్దరూ ఒక విషయంపై మాట్లాడే సీన్ మాత్రమేనని చెప్పాడు. షూటింగ్ సమయంలో దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ కోసం వక్కలు, తమలపాకులు, లవంగాలు తీసుకొచ్చారని తెలిపాడు.

ఇక అక్కడే అసలు విషయం తనకు అర్థమైందని విజయ్ సేతుపతి చెప్పాడు. ఇంత సీనియర్ నటుడైనప్పటికీ రజినీ చేసిన పని తనని ఆశ్చర్యపరిచిందని తెలిపాడు.

సీన్‌ను పదే పదే రిహార్సల్

నిజానికి రజనీకాంత్‌కు ఆ సీన్ ని ముందుగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ ఆయన మాత్రం తమలపాకు మడుస్తూ, వక్కలు, లవంగాలు వేసుకుంటూ సీన్‌ను పదే పదే రిహార్సల్ చేశారని వివరించాడు. ఒకసారి కాదు.. దాదాపు ఐదు నుంచి ఆరు సార్లు ఆయన ఆ సీన్ ని ప్రాక్టీస్ చేశారని అసలు విషయం చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి .

అంతేకాదు, రజనీకాంత్ కేవలం తన డైలాగ్స్ గురించి మాత్రమే ఆలోచించలేదని, తనకు ఎదురుగా ఉన్న నటుడు డైలాగ్ చెప్పడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు, అదే సమయంలో తాను తమలపాకును ఎలా మడవాలి అన్నదానిపై కూడా దృష్టి పెట్టారని విజయ్ సేతుపతి వివరించాడు. చిన్న చిన్న విషయాలను కూడా అంత శ్రద్ధగా గమనించడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు .

ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో 

ఇక ఇదే క్రమంలో తాను నటుడిగా ఉన్నంత కాలం రజనీకాంత్‌లా చేసే పని పట్ల డెడికేషన్ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పాడు. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా ప్రతి సీన్ ఇంత సీరియస్‌గా తీసుకోవడం తనకు ఎంతో నచ్చిందని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు.

ALSO READ:వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

ఇక ఈమధ్యే విడుదలైన ‘ది వరల్డ్ ఆఫ్ బత్తా’ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది .విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పిస్తుండటం విశేషం.మరి అక్టోబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ‘ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి .

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×