Kalki 2 Cast: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా సీక్వెల్ (పార్ట్ 2) కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా భాగం కాబోతున్నట్లు సరికొత్త టాక్ వినిపిస్తోంది.
Read also-Podarillu Today Episode : కన్నా కోరికను తీర్చిన మహా.. చక్రీకి మైండ్ బ్లాక్..జైలుకు వెళ్లిన చక్రీ..?
‘SUM-80’ పాత్రలో సాయి పల్లవి?
మొదటి భాగంలో కథా పరంగా అత్యంత కీలకమైన ‘సుమతి’ (SUM-80) పాత్రను దీపికా పదుకోన్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల పార్ట్ 2 లో ఈ పాత్రను దీపికా స్థానంలో సాయి పల్లవి చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. తన అద్భుతమైన నటనతో మెప్పించే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే సినిమాకు మరింత మైలేజ్ రావడం ఖాయం.
రంగంలోకి ఆలియా భట్!
మరోవైపు, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ భారీ సీక్వెల్‌లో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ మరియు ఇంపార్టెంట్ రోల్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించారని, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘RRR’ తర్వాత ఆలియా నటిస్తున్న మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ ఇదే కానుంది.
మరింత భారీగా ‘కల్కి 2’ క్యాస్టింగ్
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఎంట్రీతో ‘కల్కి 2’ కాన్వాస్ మరింత పెద్దదిగా మారబోతోంది. ఇప్పటికే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో నిండిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఆలియా, సాయి పల్లవిల రాకతో దేశవ్యాప్తంగా మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్, త్వరలోనే ఈ క్రేజీ కాస్టింగ్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.