Khushboo Patani:దేశంలో నిత్యం ఎన్నో అవాంచనీయ సంఘటనలు జరుగుతుంటాయి.కానీ వీటిపై సెలెబ్రెటీలు రియాక్ట్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం.మనకెందుకు వచ్చిన తంటా అనో,లేక ఇలాంటి బోలెడు జరుగుతూనే ఉంటాయి..అన్నింటికీ రియాక్ట్ అవ్వలేము కదా అనో ..ఇలా కారణాలు ఏవైనా సెలెబ్రెటీలు నోరు తెరిచి ఖండించటం చాలా కష్టం.అయితే తాజాగా బీహార్ లో జరిగిన ఒక దారుణంపై గట్టిగా రియాక్ట్ అయింది మాజీ ఆర్మీ అధికారి ఖుష్బూ పటానీ.ఇంతకీ ఈవిడ ఎవంటారా .. మన లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఉందిగా ..తన సొంత సిస్టరే ఈ ఖుష్బూ పటానీ.
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్
విషయంలోకి వెళ్తే బీహార్‌లో ఈ మధ్యే జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెల్సిందే. జముయ్ జిల్లాలో ఇద్దరు మైనర్ విద్యార్థులను కొందరు యువకులు ఆపి వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని చూసి బాలికని వేదించిన తీరుకి మండిపడ్డారు కూడా.
అమ్మాయిలకు కనీస గౌరవం కూడా లేకపోతే ఎలా
‘ఇక ఇదే విషయమై సాలిడ్ గా రియాక్ట్ అయింది బాలీవుడ్ భామ దిశా పటానీ సోదరి, మాజీ ఆర్మీ అధికారి ఖుష్బూ పటానీ.దేశం అభివృద్ధి చెందుతోంది.. ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదగాలని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అమ్మాయిలకు కనీస గౌరవం కూడా లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని అంటూ తన ఇంస్టాలో పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
జముయ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ని కోట్ చేస్తూ అమ్మాయిపట్ల అలా రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించడం, భయపెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మండిపడ్డారు.చేతిలో చట్టం లేనట్టు ప్రవర్తిస్తూ, ఎవరి జీవితంలో వాళ్లు జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు.. వాళ్లను ప్రశ్నించడానికి, బెదిరించడానికి, కొట్టడానికి తమకేం హక్కు ఉందని ఆమె నిలదీశారు. ఒక అమ్మాయి ఎవరితో స్నేహం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితులు ఎందుకు
అంతేకాదు.. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుపట్టడం సరిపోదని కూడా ఖుష్బూ అన్నారు. మన సమాజం కూడా తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ నుంచి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వస్తుంటే.. అక్కడే మహిళల భద్రత విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు.
‘ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకుంటాం. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బాధ్యత ఏంటి?’ అంటూ ఖుష్బూ పటానీ ప్రజలను ప్రశ్నించారు. చుట్టుపక్కల ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం, వీడియోలు తీయడం కూడా సరైన పని కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
also read :నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?
ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖుష్బూ డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి పని చేయాలంటే భయపడేలా శిక్ష ఉండాలని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమ్మాయిలను వేధించే వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని చెప్పారు. అయితే తాజాగా ఈ నేరస్తులు పోలీసుల ఎన్కౌంటర్ లో ప్రాణాలు పోయినట్టు తెలుస్తుంది.ఏదేమైనా ఈ శిక్షతోనైనా అలాంటి ఆలోచన చేసేవారిలో మార్పు రావాలని కోరుకుందాం !