BigTV English

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!
7 Died and 25 Injured in Ambala Road Accident: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబాలా ఆస్పత్రికి తరలించారు.

 


పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై వైష్ణో దేవికి యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి వైష్ణో దేవి దర్శనం కోసం వీరందరూ మినీబస్సులో వెళ్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి


ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొంతమందిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న కొందరు వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కంటే ముందు ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులకు వివరించారు.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×